40 ఏళ్లలోపు వారికి ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..!

ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో అత్యంత సాధారణమైన, ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. ఈ వ్యాధి లక్షణాలు చాలా మందికి తెలియవు.. కొంతమంది చిన్న సమస్యలుగా భావిస్తారు. తరచుగా మూత్ర సమస్యలు, శృంగార సమస్యలు, వెయిట్ లాస్ వంటి లక్షణాలు సూచనగా వస్తాయి. ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా చికిత్స సమయానికి చేయవచ్చు.

40 ఏళ్లలోపు వారికి ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..!
Prostate Cancer

Updated on: Aug 30, 2025 | 10:21 PM

ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో వచ్చే అత్యంత సాధారణమైన, ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. గతంలో ఇది 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు 40 ఏళ్లలోపు వారికి కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

చాలా మందికి ఈ వ్యాధి లక్షణాలు తెలియకపోవడం లేదా చిన్న చిన్న సమస్యలుగా భావించి వాటిని పట్టించుకోకపోవడం జరుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటే అది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే అధిక బరువు, పొగతాగడం, సరైన ఆహారం లేకపోవడం కూడా దీనికి కారణం కావచ్చు.

ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి..?

ప్రోస్టేట్ అనేది మగవారిలో ఉండే ఒక ముఖ్యమైన ఆర్గాన్. ఇది బ్లాడర్ కింద, మలాశయం ముందు ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం.. ప్రతి 100 మందిలో దాదాపు 13 మందికి లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది.

లక్షణాలు ఏంటి..?

  • తరచూ యూరిన్‌కి వెళ్ళడం
  • యూరిన్‌ పోసేటప్పుడు పెయిన్‌ రావడం
  • శృంగార సమయంలో నొప్పి రావడం
  • సెక్సువల్ ప్రాబ్లమ్స్
  • యూరిన్ లేదా వీర్యంలో బ్లడ్ కనిపించడం
  • వ్యాధి ముదిరితే.. ఆకలి తగ్గిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణకు పరీక్షలు

  • డీఆర్ఈ (DRE).. రెక్టమ్ ద్వారా ప్రోస్టేట్ గ్లాండ్ ఎలా ఉందో చెక్ చేయడం.
  • పీఎస్‌ఏ టెస్ట్.. బ్లడ్‌లో పీఎస్‌ఏ లెవెల్స్ కొలవడం.
  • అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ.. ట్యూమర్ ఎక్కడ ఉందో క్లియర్‌గా చూసేందుకు.
  • పీఎస్‌ఎంఏ పెట్ సీటీ ఇమేజింగ్.. క్యాన్సర్ బాడీలో ఎంత వరకు స్ప్రెడ్ అయిందో తెలుసుకోవడానికి.
  • బయాప్సీ.. ప్రోస్టేట్ నుంచి చిన్న టిష్యూ శాంపిల్ తీసి క్యాన్సర్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)