
బాలీవుడ్‌లో గ్లోయింగ్ స్కిన్ అంటే ఒక బ్రాండ్, ఒక స్టేటస్. సెలబ్రిటీలు ఏదైనా బ్యూటీ సీక్రెట్ షేర్ చేస్తే చాలు, క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన స్కిన్స్కేర్ సీక్రెట్ ఏంటో చెప్పుకొచ్చింది. మెరిసే చర్మం కోసం తాను రోజూ పచ్చి అల్లం రసం తాగుతానంటూ సీక్రెట్ రివీల్ చేసింది. ఆమె స్కిన్ సీక్రెట్‌లు చూస్తే, ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ కాదు, నేచురల్ హోమ్ రెమెడీస్.
మార్నింగ్ షాట్స్ నుంచి నైట్ మాస్క్ వరకు, డైట్ టిప్స్ ఇవన్నీ ఆమె రొటీన్‌లో భాగం. ఈ హీరోయిన గ్లోబల్ ఐకాన్, హాలీవుడ్‌లో కూడా రాణిస్తోంది. ఆమె మాటల్లో, ‘నా స్కిన్ గ్లో కోసం ఇవాల్ రెమెడీస్ ఉపయోగిస్తాను, అమ్మ, నాన్నమ్మల నుంచి నేర్చుకున్నవి’ అంటూ, ఈ సీక్రెట్‌లతో 40 పైగా కూడా మెరిసే స్కిన్ మెయింటైన్ చేస్తోంది!
ఇంతకీ ఈ బ్యూటీ సీక్రెట్ ఎవరిదీ? అని ఆలోచిస్తున్నారు. అది ఎవరో కాదు త్వరలోనే ‘వారణాసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్! బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు రాణిస్తున్న ప్రియాంకకు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇంటరాక్షన్‌లో పలు స్కిన్‌కేర్, హెల్త్ టిప్స్ షేర్ చేసింది ప్రియాంక. అందులో అందరినీ ఆశ్చర్యపరిచిన టిప్.. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి పచ్చి వెల్లుల్లిను కాళ్లపై రుద్దుకోవడం. ‘ది రా గార్లిక్ థింగ్ రియల్లీ హ్యాడ్ అ మోమెంట్, హహ్?’ అని నవ్వుతూ చెప్పింది ప్రియాంక. డైట్, ఎక్సర్‌సైజ్, స్కిన్‌కేర్ తో ఇప్పటికీ గ్లోయింగ్ స్కిన్‌తో ఫ్యాన్స్‌ని కట్టిపడేస్తోంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక మార్నింగ్ రొటీన్ పచ్చి అల్లం రసం.. అది ఆమె ఫేవరెట్ షాట్. పచ్చి అల్లం ముక్కని తురిమి, దాని రసాన్ని తీసి, ఒక స్పూన్ తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుందని చెప్పుకొచ్చింది ప్రియాంక. ‘ఇది సోర్ థ్రోట్‌కు మంచి మెడిసిన్, ఇమ్యూన్ సిస్టమ్‌ను బూస్ట్ చేస్తుంది’అని చెప్పింది. ఇది కేవలం స్కిన్ కేర్ మాత్రమే కాదు, బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి కూడా హెల్ప్ చేస్తుంది.
Priyanka Chopra
సోంపు, ధనియాలు, జీలకర్రను దోరగా వేయించి రోజూ నీటిలో కలిపి తీసుకుంటానని, ఇది యాసిడిటీ తగ్గిస్తుంది, గట్ హెల్త్ మెరుగుపరుస్తుంది అని మరో టిప్ చెప్పింది. డైట్‌లో కూడా హెల్తీ, ఆర్గానిక్ ఫుడ్‌నే తీసుకుంటుందట. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండేలా జాగ్రత్త పడుతుందట.
ఇక స్కిన్‌కేర్ రొటీన్ అంటే మార్నింగ్ క్లెన్సర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పకుండా వాడుతుందట. అంతేకాకుండా, ఇంట్లో చేసిన మాస్క్‌లను మాత్రమే ఉపయోగిస్తుందట. రైస్ వాటర్, కొబ్బరి నూనె కలిపి ప్రతి రోజు బెడ్‌టైమ్ ముందు కొన్ని నిమిషాల పాటు ముఖానికి, కాళ్లుచేతులకు అప్లై చేస్తుందట. ‘ఇది పోర్స్‌ను ష్రింక్ చేస్తుంది, స్కిన్‌ను టైట్ చేస్తుంది’ అంటూ తన గ్లోయింగ్ స్కిన్ రహస్యాలను అభిమానులతో పంచుకుంది ప్రియాంక. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ప్రియాంకలా మెరిసిపోవాలంటే వెంటనే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవడం మొదలుపెట్టండి!