Orange Side Effects: నారింజ మంచిదని తెగ తింటున్నారా.? వీరికి చాలా డేంజర్‌..

|

Jan 28, 2024 | 8:11 PM

ముఖ్యంగా ఇందులోని విటమిన్‌ సీ శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే చలికాలంలో కచ్చితంగా నారింజను తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా, కొందరు మాత్రం నారింజకు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో...

Orange Side Effects: నారింజ మంచిదని తెగ తింటున్నారా.? వీరికి చాలా డేంజర్‌..
Orange Side Effects
Follow us on

చలికాలంలో ఎక్కువగా కనిపించే పండల్లో నారింజ ముందు వరుసలో ఉంటుంది. నారింజలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్‌ సీ శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే చలికాలంలో కచ్చితంగా నారింజను తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా, కొందరు మాత్రం నారింజకు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పండును ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని చెబుతున్నారు. ఇంతకీ నారింజ పండును ఏ వ్యక్తులు తినకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* నిత్యం జలుబు, దగ్గుతో బాధపడే వారు నారింజకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నారింజలో చలువ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు ఉన్న వారికి వీటికి దూరంగా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే జలుబు, దగ్గు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.

* యాసిడిటీతో బాధపడే వారు ఆరెంజ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనికి కారణం నారింజలో ఆమ్లం కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాసిడిటీతో బాధపడే వారు ఆరెంజ్‌ తీసుకోగానే కడుపులో యాసిడ్‌ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది కడుపునొప్పికి కారణమవుతుంది.

* పంటి సమస్యలతో బాధపడే వారు కూడా ఆరెంజ్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దంతాలు బలహీనంగా ఉన్న వ్యక్తులు ఆరెంజ్‌కు దూరంగా ఉండాలి. పంటిపై ఉండే ఎనామిల్‌తో ఉన్న కాల్షియంతో కలిసి బ్యాక్టిరియాను ప్రోత్సహిస్తుంది. దీంతో పంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.

* కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్న వారు కూడా ఆరెంజ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్‌ వల్ల కిడ్నీలో రాళ్లు ఉన్న వారికి నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇక కొందరిలో ఆరెంజ్‌ వల్ల గుండెమంట సమస్య కూడా రావొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..