Papaya Side Effects: వీరు బొప్పాయి పండుకు దూరంగా ఉంటేనే మేలు.. పొరపాటున తిన్నారో అంతే సంగతులు

అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు అతిగా తింటే ఏదైనా అనర్థమే. బొప్పాయి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. బొప్పాయి కొన్ని వ్యాధులతో బాధపడేవారికి హాని చేస్తుంది. ముఖ్యంగా బ్లాడర్ స్టోన్స్‌తో బాధపడేవారు ఈ పండుకు దూరంగా ఉండాలి.

Papaya Side Effects: వీరు బొప్పాయి పండుకు దూరంగా ఉంటేనే మేలు.. పొరపాటున తిన్నారో అంతే సంగతులు
Papaya seeds for Health

Updated on: Jan 23, 2023 | 7:35 AM

బొప్పాయిలో ఫైబర్ , విటమిన్ సి తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యపరంగా శరీరానికి ఎంతో మంచింది. ముఖ్యంగా జీర్ణక్రియ, బరువు పెరగడం, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలకు ఈ పండు దివ్యౌషధం అని చెబుతారు. పైగా ఇది అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటుంది. ధర కూడా తక్కువే. అందరూ చాలామంది ఇళ్లలో బొప్పాయి పండ్లు ఉంటాయి. దీనిని రోజూ తినడానికి ప్రత్యేక కారణం అందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు అతిగా తింటే ఏదైనా అనర్థమే. బొప్పాయి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. బొప్పాయి కొన్ని వ్యాధులతో బాధపడేవారికి హాని చేస్తుంది. ముఖ్యంగా బ్లాడర్ స్టోన్స్‌తో బాధపడేవారు ఈ పండుకు దూరంగా ఉండాలి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం క్యాల్షియంతో కలిస్తే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఈ పండును అసలు తినకూడదు.

ఆస్తమా రోగులు కూడా..

అస్తమా రోగులతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పండును తినకూడదు. ఈ పండులో ఉండే ఎంజైమ్ ఆస్తమా రోగులకు హానికరం. చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు, ఎందుకంటే ఇది వారికి హానికరం. కొన్నిసార్లు గర్భస్రావం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలెర్జీ లాంటి సమస్యతో బాధపడుతుంటే కూడా బొప్పాయిని తినకండి. అందులోని పాపైన్ కంటెంట్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే చర్మంపై దురద లేదా మంట వంట సమస్యలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us