
కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెగిపోతోంది. అధిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటే సమస్యకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు చెబుతున్నా.. కొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఎన్నో రకాల కారణాలు వెంటాడుతూ ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. అంతేకాదు మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడటం, ఇప్పుడున్న పరిస్థితులను జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఆర్థికంగా, మానసికంగా తీవ్ర మైన ఒత్తిళ్లకు లోనవుతున్నారు. అయితే మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
అదిక టెన్షన్‌కు గురవుతున్న సమయంలో మంచి ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బలమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా మారి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. విటమిన్స్, మినరల్స్, మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.
కొన్ని కొన్ని విషయాలను పదే పదే ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి. వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి