AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: ఉప్పు తక్కువ తింటున్నారా?.. ప్రాణాల మీదకు తెచ్చే ఈ డేంజర్ గురించి మీకు తెలుసా?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో హై బీపీ బాధితులే కాదు, లో బీపీతో సతమతమయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చాలామంది ఉప్పు తింటే బీపీ పెరుగుతుందనే భయంతో అసలు ఉప్పే వాడటం మానేస్తున్నారు. దీనివల్ల శరీరంలో సోడియం స్థాయిలు పడిపోయి రక్తపోటు అసాధారణంగా తగ్గుతుంది. కళ్లు తిరగడం, వికారం, దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే మీ శరీరం మీకు హెచ్చరిక పంపిస్తోందని అర్థం

Health Alert: ఉప్పు తక్కువ తింటున్నారా?..  ప్రాణాల మీదకు తెచ్చే ఈ డేంజర్ గురించి మీకు తెలుసా?
Low Blood Pressure Symptoms Telugu
Bhavani
|

Updated on: Mar 31, 2026 | 12:13 PM

Share

వైద్య పరిభాషలో రక్తపోటు 90/60 mmHg కంటే తక్కువగా ఉంటే దానిని హైపోటెన్షన్ (Hypotension) అంటారు. శరీరంలో నీటి శాతం తగ్గడం, సోడియం లోపం దీనికి ప్రధాన కారణాలు. అకస్మాత్తుగా బీపీ పడిపోయినప్పుడు ఒక గ్లాసు ఉప్పు నీరు ఎలా సంజీవనిలా పనిచేస్తుంది? కాళ్లను పైకి ఎత్తి పడుకోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఎలా మెరుగుపడుతుంది? అనే ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్య లక్షణాలు: అకస్మాత్తుగా తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, విపరీతమైన నీరసం, ఏకాగ్రత దెబ్బతినడం, చర్మం చల్లగా మారి చెమటలు పట్టడం.

ఉప్పు నీటి మ్యాజిక్: మీకు నీరసంగా అనిపించినప్పుడు వెంటనే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగండి. ఇది శరీరంలో సోడియం స్థాయిని పెంచి రక్తపోటును సాధారణ స్థితికి తెస్తుంది.

శరీర స్థితి (Positioning): అకస్మాత్తుగా తల తిరిగినప్పుడు వెంటనే పడుకుని, కాళ్ల కింద దిండు పెట్టి కొద్దిగా పైకి ఎత్తి ఉంచండి. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ వేగవంతమై త్వరగా కోలుకుంటారు.

నీటి వినియోగం: డీహైడ్రేషన్ వల్ల బీపీ పడిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి రోజంతా పుష్కలంగా నీరు, కొబ్బరి నీళ్లు లేదా పళ్ల రసాలు తాగుతూ ఉండాలి.

కేఫీన్ ప్రభావం: బీపీ తక్కువగా ఉన్నప్పుడు స్ట్రాంగ్ టీ లేదా కాఫీ తాగడం వల్ల అందులోని కేఫీన్ రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది. అయితే దీనిని అలవాటుగా మార్చుకోకూడదు.

తక్కువ రక్తపోటును నిర్లగ్నం చేయడం వల్ల మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి ప్రమాదకరంగా మారవచ్చు. పైన చెప్పిన చిట్కాలు పాటించినా సమస్య తరచుగా వేధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

లో బీపీ ఉన్నవారు ఒకేసారి భారీగా భోజనం చేయకుండా, తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం వల్ల రక్తపోటు నిలకడగా ఉంటుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఆరోగ్య పరమైన మార్పులు చేసుకునేముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..