వామ్మో.. జుట్టు ఎక్కువగా రాలుతోందా.. అయితే, శరీరంలో ఆ పార్ట్ డ్యామేజ్ అయ్యినట్టే..

కాలేయం (లివర్) శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం.. ఎన్నో విధులను నిర్వహిస్తుంది.. విష పదార్థాలను వడపోయడం, జీర్ణక్రియకు సహాయపడటం, శక్తిని నిల్వ చేయడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం వంటి కీలకమైన పనులను కాలేయం నిర్వర్తిస్తుంది.. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా కాలేయ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి.

వామ్మో.. జుట్టు ఎక్కువగా రాలుతోందా.. అయితే, శరీరంలో ఆ పార్ట్ డ్యామేజ్ అయ్యినట్టే..
Hair Loss

Updated on: Apr 23, 2025 | 3:03 PM

కాలేయం (లివర్) శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం.. ఎన్నో విధులను నిర్వహిస్తుంది.. విష పదార్థాలను వడపోయడం, జీర్ణక్రియకు సహాయపడటం, శక్తిని నిల్వ చేయడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం వంటి కీలకమైన పనులను కాలేయం నిర్వర్తిస్తుంది.. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా కాలేయ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో కొవ్వు కాలేయం (ఫ్యాటీ లివర్) ఒక సాధారణ సమస్యగా మారింది. కాలేయ సమస్యలు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.. కానీ కాలేయ సమస్యలు జుట్టును కూడా ప్రభావితం చేస్తాయా? కాలేయం – జుట్టు మధ్య సంబంధం ఉందా? కాలేయం దెబ్బతినడం వల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుందా లేదా జుట్టు బూడిద రంగులోకి మారుతుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..

ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ సుభాష్ గిరి మాట్లాడుతూ.. గత దశాబ్దంలో భారతదేశంలో కాలేయ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఫ్యాటీ లివర్ ఒక సాధారణ వ్యాధిగా మారిందని.. ప్రతి ముగ్గురిలో ఒక వ్యక్తికి కొవ్వు కాలేయం ఉంటుందని తెలిపారు. ఇది చెడు ఆహారపు అలవాట్లు, క్షీణించిన జీవనశైలి కారణంగా జరుగుతోంది.

కాలేయం తనను తాను బాగుచేసుకునే అవయవం.. కానీ మద్యం, జంక్ ఫుడ్, అధిక పిండి, రెడ్ మీట్ తీసుకోవడం వల్ల ఈ అవయవం దెబ్బతింటోంది. కాలేయంలో సమస్య మొత్తం జీర్ణవ్యవస్థ, గుండె, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది.

కాలేయం సమస్య జుట్టును ప్రభావితం చేస్తుందా?..

కాలేయ వ్యాధికి, జుట్టు రాలడానికి మధ్య సంబంధం ఉందని డాక్టర్ సుభాష్ పేర్కొన్నారు. సరైన ఆహారం లేకపోవడం వల్ల శరీరం ఐరన్, విటమిన్లు వంటి పోషకాలను గ్రహించి ఉపయోగించుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీని వల్ల జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాలేయం దెబ్బతినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.. శరీరంలో వాపు కూడా వస్తుంది.

కాలేయం దెబ్బతిన్నప్పుడు, అది ఐరన్, బయోటిన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలను గ్రహించడానికి, ఉపయోగించడానికి ఇబ్బంది పడవచ్చు.. ఇది జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా జుట్టు రాలుతుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ కాలేయ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా..

సమతుల్య ఆహారం తీసుకోండి – ఆహారంలో పండ్లు – ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోండి.

మద్యం వినియోగాన్ని పరిమితం చేయండి లేదా మానుకోండి..

టాక్సిన్స్, హానికరమైన రసాయనాలను నివారించండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

చక్కెర, పిండి – ఉప్పు తినడం మానుకోండి

ఒత్తిడిని నిర్వహించండి

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..