Ear Problem: వర్షాకాలంలో చెవి సమస్యలా.. అస్సలు ఇలా చేయకండి!!

వర్షాకాలం మొదలైంది.. వర్షాకాలం అనగానే గుర్తొచ్చేవి సీజనల్ వ్యాధులు, చర్మ సంబంధిత అలర్జీలు.. జలుబు, దగ్గు, జ్వరాలే కాదు.. చాలా మంది వర్షాకాలంలో చెవినొప్పితో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకు కారణం చెవులను పట్టించుకోకపోవడమే..

Ear Problem: వర్షాకాలంలో చెవి సమస్యలా.. అస్సలు ఇలా చేయకండి!!
Ear Problem

Updated on: Jul 24, 2023 | 3:16 PM

వర్షాకాలం మొదలైంది.. వర్షాకాలం అనగానే గుర్తొచ్చేవి సీజనల్ వ్యాధులు, చర్మ సంబంధిత అలర్జీలు.. జలుబు, దగ్గు, జ్వరాలే కాదు.. చాలా మంది వర్షాకాలంలో చెవినొప్పితో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకు కారణం చెవులను పట్టించుకోకపోవడమే. చర్మంపై, ఆరోగ్యం పై చూపించే శ్రద్ధ.. చెవులను జాగ్రత్తగా చూసుకోవడంలోనూ ఉండాలి.

వర్షాకాలంలో ఫంగల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. తేమ కారణంగా సూక్ష్మజీవులు చెవిని చుట్టుముడతాయి. ఫలితంగా చెవి లోపలి భాగంగా నొప్పివస్తుంది. చాలా మంది స్నానం చేయగానే చెవుల్లో తేమను, పేరుకున్న మురికి తొలగించేందుకు ఇయర్ బడ్స్ వాడుతుంటారు. నాణ్యత లేని ఇయర్ బడ్స్ వాడకం వల్ల కూడా చెవి సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

స్నానం చేసిన తర్వాత ఇయర్ బడ్స్ కంటే.. కాటన్ వస్త్రంతో చెవిని శుభ్రం చేసుకోవడం మంచిది. నొప్పి, దురద, దుర్వాసనతో కూడిన వాపు, స్రావం వంటి లక్షణాలు కనిపించినపుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. దురదగా ఉందని పిన్నిస్ తో చెవిని కదిపితే.. అది మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా వినికిడి సమస్య తలెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

అలాగే చెవి సమస్యలు ఉన్నా, లేకపోయినా అధికంగా సౌండ్ వినిపించేలా ఇయర్ ఫోన్స్ వాడకం అంతమంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతరుల ఇయర్ ఫోన్స్ అస్సలు వాడకూడదు. వారికి ఉన్న హానికర క్రిములు మీకూ వచ్చే ఆస్కారం ఉంది.

వీలైనంతవరకూ వర్షాకాలంలో చల్లని, పుల్లని పానీయాలు తాగకపోవడం మేలు. రాత్రివేళల్లో పడుకునే ముందు రెండు చెవులలో కాటన్ పెట్టుకోవడం చెవి ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చెవినొప్పి, చెవిపోటు లక్షణాలున్నవారు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులను సంప్రదించడం మేలు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us