అరటిపండు కదా అని తీసిపారేయకండి.. లాభాలు ఎన్నో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

అరటి పండు ఏడాది అంతా లభిస్తూనే ఉంటుంది. అది కూడా అందుబాటు ధరలో ఉంటుంది. అది చేసే మేలు కూడా అంతా ఇంతా కాదు. మెగ్నీషియం, మాంగనీస్‌, పొటాషియం, రిబోఫ్లేవిన్‌, ఫొలేట్‌, పీచు, కాపర్‌, బి6, సి-విటమిన్లు దీని నుంచి లభిస్తాయి. తిన్న వెంటనే ఎనర్జీ ఇస్తుంది.

అరటిపండు కదా అని తీసిపారేయకండి.. లాభాలు ఎన్నో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Banana

Edited By: Ravi Kiran

Updated on: Apr 13, 2024 | 8:59 PM

అరటి పండు ఏడాది అంతా లభిస్తూనే ఉంటుంది. అది కూడా అందుబాటు ధరలో ఉంటుంది. అది చేసే మేలు కూడా అంతా ఇంతా కాదు. మెగ్నీషియం, మాంగనీస్‌, పొటాషియం, రిబోఫ్లేవిన్‌, ఫొలేట్‌, పీచు, కాపర్‌, బి6, సి-విటమిన్లు దీని నుంచి లభిస్తాయి. తిన్న వెంటనే ఎనర్జీ ఇస్తుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా దూరంగా ఉంచుకుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ నొప్పి, వాపులను తగ్గించి.. బాడీ మొత్తా్న్ని హెల్తీగా ఉంచుతాయి. హార్మోన్లను రెగ్యూలేట్ చేస్తుంది. అరటిపండు కిడ్నీల్లో సమస్యలను నివారిస్తుంది. వర్కవుట్స్ చేసిన తర్వాత ఒక అరటిపండు తింటే,, నీరసం ఉండదు. ఇంత మేలు చేసే టేస్టీగా కూడా ఉంటుంది కనుక ఇష్టంగానే తినేయొచ్చు. దీన్ని ఓట్‌మీల్‌, స్మూథీ, , మిల్క్‌షేక్‌, సలాడ్స్‌లోనూ వేసుకోవచ్చు, స్వీట్లూ చేయొచ్చు. ఇన్ని లాభాలున్నప్పటికీ.. ఉబ్బసం, సైనస్‌, అలర్జీలు లాంటి ఇబ్బందులేమైనా ఉండి బాధపడుతుంటే మాత్రం అరటిపండు తినకూడదు.

అరటిలో పొటాషియం అధిక పాళ్లలో ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు మంచిది. వారానికి 2-3 అరటి పండ్లు తినేవాళ్లు.. కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు తక్కువని ఓ రీసెర్చ్‌లో తేలింది. రోజుకో అరటి పండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అరటి పండులో బోలెడన్ని కార్బోహైడ్రేట్స్, చక్కెర ఉంటాయి. ఇవి సహజ సిద్దమైన ఎనర్జీ బూస్టర్స్‌లా పనిచేస్తాయి. ఈ పండు క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అల్సర్స్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణాశయంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది.