మన ఇంటి పరిసరాల్లో ఉండే చెట్లు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. ఇంట్లో చెట్లు ఉండడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలుంటాయి. తులసి.. వేప.. మందరా వంటి చెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీజనల్ వ్యాధులను తగ్గించడంలోనూ ఈ చెట్లు బెస్ట్. అయితే రేల చెట్టు గురించి తెలుసా.. ఈ చెట్టు ఇళ్లలో ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా పార్కులలో ఈ చెట్లు కనిపిస్తాయి. రేల పువ్వులు రోడ్డుపై పసుపు తివాచి పరిచినట్లుగా కనిపిస్తాయి. కేవలం చూడటానికి అందగానే కాకుండా.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి.
రేల చెట్టు ఆయుర్వేదంలో ఔషధ వృక్షంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు పువ్వులు, ఆకులు మాత్రమే కాకుండా.. బెరడు, కాండం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గజ్జి, దురద, అలెర్జీ వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి రేల చెట్టు సహాయపడుతుంది. బీన్స్ లాగా ఉండే ఈ రేల పండ్లను పేస్ట్ గా చేసి గజ్జి, దురద ఉన్న చోట అప్లై చేయాలి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ రేల చెట్టు మంచి పాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు బెరడులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోదక శక్తిని పెంచడమే కాకుండా.. సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
రేల పువ్వులు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వీటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయడం వలన చర్మంపై ఉన్న మచ్చలు, టానింగ్ తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు తగ్గించడంలో రేల ఉపయోగపడుతుంది. రోజూ ఈ రేల ఆకులను తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు.. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో రేల బెరడు చాలా సహాయపడుతుంది. ఇందుకోసం అమల్టా్స్ చెట్టు బెరడు సారాన్ని తయారుచేసి తినవచ్చు. ఈ సారం ఇన్సులిన్ ను నియంత్రిస్తుంది. ఇది చక్కర స్థాయిని నియంత్రిస్తుంది.
Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్
Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!