Health: ఈ ఆకుల వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్​ ఏంటో మ్యాడైపోతారు..

ప్రకృతి మనకు అందించిన ఔషధ గుణాల కలిగిన మొక్కల్లో కర్పూరవల్లి ఒకటి. , కర్పూరవల్లి మన పూర్వీకుల వైద్య పద్ధతుల్లో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది. ఆధునిక జీవనశైలిలో సైతం దీని ప్రాముఖ్యత తగ్గలేదు. నేటి రసాయన ఆధారిత వైద్యం యుగంలో, కర్పూరవల్లిలాంటి సహజ మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Health: ఈ ఆకుల వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్​ ఏంటో మ్యాడైపోతారు..
Karpooravalli

Updated on: May 25, 2025 | 5:47 PM

పైన ఫోటోల కనిపిస్తున్న మొక్కను చూశారా అదేదో పిచ్చిమొక్క అనుకునేరు. ఆయుర్వేదంలో దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దాని పేరు కర్పూరవల్లి.  ఇండియన్ బొరేజ్ లేదా వామాకు అని కూడా పిలిచే దీన్ని ఒక అరుదైన మూలికగా చెబుతుంటారు. మందమైన ఆకులు, తేలికపాటి మృదువైన పూవులతో మసాలా కర్పూరం వాసన కలిగి ఉంటుంది. కర్పూరం వాసనను పోలిన ప్రత్యేక సువాసన ఉండటం వల్ల దీన్ని “కర్పూరవల్లి” అని పిలుస్తారు. చిన్నచిన్న కాండాలతో పెరిగే ఈ మొక్కను ఇంటి పెరట్లో ఎంచక్కా పెంచుకోవచ్చు. ఈ ఆకులతో బజ్జీలు వేసుకోవచ్చు.. పచ్చడి పెట్టుకోవచ్చు.. ఆకులను నీటిలో మరిగించి తాగొచ్చు.. లేదా సూప్‌లా కూడా చేసుకోవచ్చు.

దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం…

శ్వాసకోశ ఆరోగ్యం : జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, నోటి పూత, గొంతు వాపు వంటి సమస్యలకు కర్పూరవల్లి ఆకుల రసం ఒక ప్రకృతి వైద్యంగా ఉపయోగపడుతుంది. ఈ  ఆకులను కాచి ఆవిరి పట్టుకుంటే ఛాతీలో పేరుకున్న కఫం తొలగిపోతుంది. కర్పూరవల్లి కషాయం శ్వాసనాళాలు శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థకు మంచి మెడిసిన్: కర్పూరవల్లి ఆకుల రసాన్ని తాగితే అజీర్తి, పొట్ట నొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

చర్మ సమస్యల పరిష్కారం:  కర్పూరవల్లి రసం చర్మ దద్దుర్లు, పొడిచర్మం వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. , తామర వాపు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుందట.

 గాయాలకు ఉపశమనం:  కర్పూరవల్లి ఆకులను తరిగి, పేస్టులా చేసి గాయాలపై పెట్టితే ఉపశమనం కలుగుతుంది.

ఇమ్యూనిటీ బూస్టర్:  ఈ మొక్కలోని పౌష్టిక గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

కర్పూరవల్లి మొక్కను చిన్న కాండాలను నాటడం ద్వారా పెంచుకోవచ్చు. ఎక్కువ నీరు అవసరం లేదు. సూర్యకాంతి ఉండే ప్రదేశంలో పెంచడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..