Cycling: ప్రతిరోజూ 30 నిమిషాలు సైకిల్ తొక్కితే ఎన్ని లాభాలో తెలుసా?

ఉదయం 6 గంటలకు రోడ్డు మీద సైకిల్ తొక్కితే వచ్చే లాభాలకు ఏ జిమ్ కూడా సాటి రాదు. సైక్లింగ్ అంటే కేవలం ఎక్సర్‌సైజ్ మాత్రమే కాదు.. అది ఒక లైఫ్‌స్టైల్, ఒక థెరపీ, ఒక ఆనందం! ఇది స్వయంగా డాక్టర్లు చెబుతున్న మాట. సైకిల్​ ..

Cycling: ప్రతిరోజూ 30 నిమిషాలు సైకిల్ తొక్కితే ఎన్ని లాభాలో తెలుసా?
Cycling

Updated on: Nov 25, 2025 | 7:32 PM

ఉదయం 6 గంటలకు రోడ్డు మీద సైకిల్ తొక్కితే వచ్చే లాభాలకు ఏ జిమ్ కూడా సాటి రాదు. సైక్లింగ్ అంటే కేవలం ఎక్సర్‌సైజ్ మాత్రమే కాదు.. అది ఒక లైఫ్‌స్టైల్, ఒక థెరపీ, ఒక ఆనందం! ఇది స్వయంగా డాక్టర్లు చెబుతున్న మాట. సైకిల్​ తొక్కడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగానూ చాలా ఉపయోగాలు ఉన్నాయి.

శరీరంలోని కండరాలు దృఢంగా మారుతాయి, అదేవిధంగా ఉదయాన్నే సైకిల్​ తొక్కడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎడ్రినలిన్​ స్థాయిలు మెరుగుపడి శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది. రోజూ సైకిల్​ తొక్కడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..

రోజూ 30 నిమిషాల సైక్లింగ్‌తో వారానికి 1500–2000 కేలరీలు బర్న్ అవుతాయి. కాళ్ల కండరాలు బలపడతాయి, జాగింగ్‌తో పోలిస్తే మోకాళ్లపై 70% ఒత్తిడి తక్కువ, గుండె బలంగా పనిచేస్తుంది, రక్తపోటు తగ్గుతుంది, చెడు కొలెస్ట్రాల్ (LDL) కరిగిపోతుంది. డయాబెటిస్ రిస్క్ 40% వరకు తగ్గుతుందని హార్వర్డ్ రీసెర్చ్ చెబుతోంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది బెస్ట్ ఎందుకంటే కార్డియో, స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ రెండూ ఒకేసారి జరుగుతాయి.

మానసిక ఆరోగ్యానికి సైక్లింగ్​ అద్భుతంగా పనిచేస్తుంది. సైక్లింగ్‌లో హ్యాపీ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ అధిక మొత్తంలో విడుదలవుతాయి. ఒత్తిడి, ఆందోళన 50% వరకు తగ్గుతాయి. బయట సైక్లింగ్ చేస్తే విటమిన్ D కూడా పుష్కలంగా అందుతుంది. ఎముకలు బలపడతాయి, మూడ్ మెరుగవుతుంది. నిద్ర బాగా పడుతుంది, మెదడు షార్ప్ అవుతుంది. ఒక డానిష్ స్టడీ ప్రకారం, రోజూ సైకిల్ తొక్కే వాళ్లు డిప్రెషన్‌కి గురయ్యే ఛాన్స్ 20% తక్కువ! సైక్లింగ్​ కంటే లాభదాయకమైనది, చవకైన ఎక్సర్​సైజ్​ మరోటి లేదు. మరెందుకు ఆలస్యం రేపటి నుంచే సైక్లింగ్​ మొదలు పెట్టేయండి!

Follow Us