మార్కెట్‌లో లభించే ప్యాక్‌డ్ జ్యూస్‌లను అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే పండ్లకు బదులుగా ప్రిజర్వేటివ్‌లు, చక్కెర, పండ్ల రుచులు పెద్ద ఎద్దుత మిక్స్ చేస్తారు. ఇవి మీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే మార్కెట్‌లో లభించే జ్యూస్‌లు అస్సలు తాగొద్దు. ఇంట్లో తయారు చేసిన జ్యూస్‌లను మాత్రమే తాగాలి.
కొంత మంది జ్యూస్ చేసిన తరువాత ఎక్కువ సేపు అలాగే ఉంచుతారు. కానీ, ఎప్పుడూ అలా చేయొద్దు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జ్యూస్ చేసిన తరువాత, దానిని 20 నిమిషాలలోపు తాగేయాలి. అప్పుడే దాని పూర్తి ప్రయోజనాలు అందుతాయి. ఎక్కువ సేపు ఉంచడం వల్ల అందులోని పోషకాలు నశించిపోతాయి.
వ్యాయామం చేసిన అరగంట తరువాత జ్యూస్ తాగాలి. అలా చేస్తే.. శరీరానికి పోషకాలతో పాటు సహజ చక్కెర అందుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.
జ్యూస్ ఉదయం సమయంలో తాగడమే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య జ్యూస్ తాగడం మంచిదంటున్నారు. ఈ సమయాల్లో జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి, వివిధ పోషకాలు అందుతాయని చెబుతున్నారు.