
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో వచ్చిన ఓ రిసెర్చ్ ప్రకారం.. ఎక్కువసేపు మొబైల్, టాబ్లెట్, టీవీ స్క్రీన్‌ల ముందు గడిపే పిల్లలు, టీనేజర్లకు భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇది పేరెంట్స్‌కి ఒక వార్నింగ్ లాంటిదే. పిల్లల హెల్త్‌కు స్క్రీన్ టైమ్ తగ్గించి హెల్దీ హ్యాబిట్స్ నేర్పించడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ స్టడీ గుర్తు చేస్తుంది.
ఆన్‌లైన్ క్లాసులు, వీడియో గేమ్స్, యూట్యూబ్, స్ట్రీమింగ్ కంటెంట్.. ఇవన్నీ చిన్న వయసులోనే పిల్లలను స్క్రీన్ లకు అడిక్ట్ చేస్తున్నాయి. కొంతమంది పిల్లలు నిద్రపోయే ముందు కూడా మొబైల్ వాడటం మానుకోరు. దీని వల్ల వారి ఏకాగ్రత, మెంటల్ హెల్త్ మాత్రమే కాకుండా గుండె పనితీరుపై కూడా నెగటివ్ ఎఫెక్ట్ పడుతుందని పరిశోధకులు అంటున్నారు.
ఈ రీసెర్చ్‌లో 1000 మందికి పైగా పిల్లలను రెండు నెలల పాటు గమనించారు. వారి నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ, బరువు, బీపీ, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లాంటివి కొలిచారు. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?
ఈ స్టడీ అమెరికాలో జరిగినప్పటికీ.. దీని ఎఫెక్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలకూ వర్తిస్తుంది. మన దేశంలోనూ పిల్లలు ఎక్కువగా మొబైల్ వాడుతున్నారు. రాత్రిపూట స్క్రీన్ వాడకం నిద్రను డిలే చేస్తుంది. బ్లూ లైట్ కారణంగా హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీని వల్ల ఊబకాయం, ఇన్సులిన్ సమస్యలు, బీపీలో మార్పులు.. ఇవన్నీ గుండె జబ్బులకు దారి తీస్తాయి.
పిల్లల ఆరోగ్యంపై ప్రతి స్క్రీన్ నిమిషం ఎఫెక్ట్ చూపుతుంది. గాడ్జెట్ వాడకాన్ని కంట్రోల్ చేయడం, సరైన నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ.. ఇవే భవిష్యత్తులో గుండె సమస్యలు రాకుండా కాపాడగల ముఖ్యమైన మార్గాలు.