Male Infertility: ప్రస్తుత బిజీ ప్రపంచంలో పురుషుల్లో వంధ్యత్వ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అసంబద్ధమైన జీవనశైలి, స్వీయ సంరక్షణ లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం ప్రధాన కారణం కావచ్చు. అయితే, ప్రధాన కారణం మరొకటి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బలహీనమైన మానసిక ఆరోగ్యం పురుషుల్లో వంధ్యత్వ సమస్యను మరింత పెంచుతుందని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేనప్పుడు, పురుషుల స్పెర్మ్ నాణ్యత, కౌంట్ రెండూ వేగంగా పడిపోతాయి. స్పెర్మ్ ప్రభావం వల్ల సంతానలేమి సమస్య వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. గతంలో వంధ్యత్వ సమస్యలు స్త్రీలలో మాత్రమే కనిపించేది. కానీ, ప్రస్తుత కాలంలో ఈ సమస్య పురుషులలో కూడా వేగంగా పెరుగుతోంది. దీనికి కారణం ధూమపానం, మద్యపానం, బయటి ఆహారం, స్టెరాయిడ్ వాడకం, కాలుష్యం, అధిక బరువు వంటివి చెబుతున్నారు నిపుణులు. కాగా, మంచి ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంచుకుని, సంతానోత్పత్తిని మెరుగుపరచవచ్చునని చెబుతున్నారు. స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వం సమస్య తొలగిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ధ్యానం చేయాలి..
ధ్యానం వ్యక్తిలో మానసిక ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధ్యానం చేయడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేయడం వలన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా వంధ్యత్వ సమస్య నుంచి బయటపడొచ్చు.
యోగా..
భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను గ్రహిస్తున్నారు. అన్ని రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన చికిత్స. వంధ్యత్వానికి గురికాకుండా ఉండాలంటే ప్రతిరోజూ యోగా చేయాలి. అనేక రకాల యోగాసనాలు ఉన్నాయి. వాటిని ప్రయత్నించవచ్చు.
కొంత టైమ్ ఫ్రీ చేసుకోండి..
మానిసక ఆరోగ్యం క్షీణించడం వెనుక రెస్ట్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తమకు తాము కొంత సమయం కేటాయించుకుని రిలాక్స్ అవ్వాలి. ఆ సమయంలో తమకు ఇష్టమైన పనిని చేయాలి. పుస్తకాలు చదువుతారా? గేమ్స్ ఆడతారా? అనేది మీ అభిప్రాయం. కానీ, ఈ చర్య వలన మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. వంధ్యత్వాన్ని నివారించడంలో ఇది అద్భుత ఫలితాన్నిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..