Tears of Blood: బహిష్టు సమయంలో ఆ మహిళ కంట రక్తం.. ఆశ్యర్యపోయిన వైద్యులు.. ఎక్కడో తెలుసా..?

|

Mar 19, 2021 | 9:12 PM

Periods: ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఆందోళన కలిగించే విషయాలు బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని తెలిసిన వైద్యులే నిర్ఘాంతపోయే వార్త మనముందుకు వచ్చింది. ఈ సంఘటన ఎక్కడో కాదు మన

Tears of Blood: బహిష్టు సమయంలో ఆ మహిళ కంట రక్తం.. ఆశ్యర్యపోయిన వైద్యులు.. ఎక్కడో తెలుసా..?
Woman Cries Tears Of Blood
Follow us on

Periods: ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఆందోళన కలిగించే విషయాలు బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని తెలిసిన వైద్యులే నిర్ఘాంతపోయే వార్త మనముందుకు వచ్చింది. ఈ సంఘటన ఎక్కడో కాదు మన భారతదేశంలోనే చోటుచేసుకుంది. మహిళలు నెలకొకసారి సంభవించే రుతుస్రావంతో చాలా బాధపడుతుంటారు. అలాంటి బాధకు మరో బాధ ఎదురైతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే.. బహిస్టు సమయంలో తన కంటి నుంచి రక్తం కారుతోందంటూ చండిఘడ్ కు చెందిన 25 ఏళ్ల ఓ వివాహిత స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిని ఆశ్రయించింది. అయితే అంతకుముందు కూడా ఆమెకు ఇలానే జరిగిందంటూ పేర్కొంది. కంటి నుంచి రక్తం వస్తున్నా.. తనకు ఎలాంటి ఇబ్బంది కానీ బాధ కానీ లేదని ఆమె చెప్పింది. దీంతో ఆందోళన చెందిన వైద్యులు వెంటనే ఆమెకు పరీక్షలు చేశారు. దీంతో వైద్యులు కంటితోపాటు పలు పరీక్షలను చేశారు. కానీ.. ఆమెకు ఎలాంటి కంటి సమస్యలు లేనట్టు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులే ఆశ్చర్యపోయారు.

ఆ తరువాత వైద్యులు ఈ సమస్యపై మరింత లోతైన అధ్యయనం చేయగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కంటి వెంట రక్తం కారిన రెండు సందర్భాల్లోనూ ఆ మహిళ బహిస్టులో ఉన్నట్టు వైద్యులు తెలుసుకొని అధ్యయనం చేశారు. దీంతో ఆమెకు సంబంధించిన సమస్యపై మరింత క్లారిటీ వచ్చింది. ఆమె ఓక్యులార్ వికేరియస్ మెస్ట్రుయేషన్ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో బహిస్టు సమయంలో కంట్లోంచి రక్తం కారే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

సాధారణంగా.. కంట్లో ట్యూమర్ ఉన్నా, ఏదైనా దెబ్బ తగిలినా ఇలాంటి సమస్య తలెత్తుతుందని వైద్యులు పేర్కొన్నారు. కానీ..రుతుస్రావం సందర్భంగా శరీరంలోని హార్మోన్లలో మార్పులు జరగడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు పేర్కొంటున్నారు. మహిళల్లో ఉండే హార్మోన్ల కారణంగా గర్భాశయంలోని రక్తనాళాలు పలుచబడి రక్తం కారుతుంది. ఇదే పరిస్థితి మహిళ కంటిలో కూడా ఏర్పడి ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

 

Also Read:

Snake: కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. బాటిల్లో పాము పిల్ల దర్శనం.. వీడియో వైరల్

Feeling Tired In Office: ఆఫీసులో పనిచేసేప్పుడు ఊరికే అలిసిపోతున్నారా..? పరిశోధకులు ఏం సలహాలిస్తున్నారో చూడండి..