
పసుపులో మంట తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుణాలు శరీరంలోని హార్మోన్ల స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి వంటి సమస్యలు తగ్గుతాయి. రోజువారీ ఆహారంలో పసుపు వేసి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది.
అల్లం కూడా మంట తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. శరీరంలో ఉన్న మంటను తక్కువ చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరిని తగ్గించడంలో అల్లం మంచి పాత్ర పోషిస్తుంది. రోజూ అల్పాహారంలో లేదా టీగా తీసుకుంటే హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి.
దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల హార్మోన్ల స్థాయి కూడా సమంగా ఉంటుంది. దీనిలో కూడా మంట తగ్గించే గుణాలు ఉంటాయి. దీనిని టీలో వేసి తీసుకోవచ్చు లేదా ఇతర వంటకాలలో ఉపయోగించవచ్చు.
అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైటో ఈస్ట్రోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతకు చాలా అవసరం. ఓట్స్ లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. వెల్లుల్లి తినడం ద్వారా హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. దీనితో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించాలంటే మెంతులు చాలా ఉపయోగపడతాయి. మెంతి గింజలు, మెంతి టీ రూపంలో తీసుకుంటే హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి. ఉదయం ఖాళీ పొట్ట మీద మెంతి టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ సహకరిస్తుంది. ఇది శరీరంలో అడ్రినల్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల హార్మోన్లు సమతుల్యంలోకి వస్తాయి. అశ్వగంధను పౌడర్ లేదా క్యాప్సూల్ రూపంలో తీసుకోవచ్చు.
జీలకర్రలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉన్న లక్షణాలు మంట తగ్గించి జీర్ణవ్యవస్థకు ఉపయోగపడుతుంది. జీలకర్ర టీ తాగడం వల్ల హార్మోన్ల సమతుల్యతకు సహాయమవుతుంది.
తేనెలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. తేనె మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి శక్తినిచ్చే మంచి పదార్థం. తేనెను నీటిలో కలిపి లేదా టీతో కలిపి తీసుకుంటే హార్మోన్ల స్థితి మెరుగవుతుంది. ఈ పదార్థాలన్నీ మన వంటింట్లో లభ్యమవుతాయి. వీటిని సరైన విధంగా తీసుకుంటే శరీర హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)