Corona Vaccine Immunity: కోవిడ్ వ్యాక్సిన్ రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎంత కాలం ఉంటుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Corona Vaccine Immunity: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌కు ఎట్ట‌కేల‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభ‌మైంది....

Corona Vaccine Immunity: కోవిడ్ వ్యాక్సిన్ రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎంత కాలం ఉంటుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
Follow us

|

Updated on: Jan 10, 2021 | 5:57 AM

Corona Vaccine Immunity: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌కు ఎట్ట‌కేల‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభ‌మైంది. అయితే వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. 2021లో వ్యాక్సిన్ల‌ను బిలియ‌న్ల మందికి వేయ‌డ‌మ‌నేది భారీ స‌వాలుతో కూడుకున్న ప‌ని. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా నిర్మూల‌న కోసం వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే ఈ క‌రోనా వ్యాక్సిన్లు ఎంత మొత్తంలో స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేయ‌గ‌ల‌వు అనేది ఖ‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి ఉంది. మీజిల్స్‌కు వ్యాక్సిన్ రోగ‌నిరోధ‌క శ‌క్తి జీవిత‌కాలం ఉంటుంది. అందుకే ఈ టీకాల‌ను ఒక్క‌సారి మాత్ర‌మే తీసుకోవాలి.

అయితే స్ట‌మ‌క్‌ఫ్లూకు కార‌ణ‌మ‌య్యే నోరోవైర‌స్ రోగ‌నిరోధ‌క శ‌క్తి కేవ‌లం ఆరు నెల‌లు మాత్ర‌మే ఉంటుంది. వ్యాధి నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాలంటే త‌ర‌చూ టీకాలు వేయ‌డం అవ‌స‌ర‌మ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. క‌రోనా వ్యాక్సిన్ల‌లో రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎంత కాలం ఉంటుందో చెప్ప‌లేమ‌ని అంటున్నారు. బ‌హుశా మ‌న జీవితాంతం ఒకే టీకా మాత్ర‌మే అవ‌స‌రం ఉండ‌వ‌చ్చు. ఫ్లూకు వ్య‌తిరేకంగా ప్ర‌తి ఏడాది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉటుంది. లేదంటే ప్ర‌తి రెండేళ్ల‌కు సాధార‌ణ సాట్లు అవ‌స‌రం ఉండ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

అయితే ఈ వైర‌స్ ప్రారంభంలో అనేక అధ్య‌య‌నాలు SARS-CoV-2కు యాంటీబాడీస్ మొద‌టి కొన్ని నెల‌ల త‌ర్వాత క్షీణిస్తాయ‌ని గుర్తించారు. టీకా రోగ‌నిరోధ‌క శ‌క్తి కార‌ణంగా ప్ర‌జ‌లు త‌మ స‌హాజ రోగ‌నిరోధ‌క శ‌క్తిని త్వ‌ర‌గా కోల్పోయే ప్ర‌మాదం ఉందంటున్నారు.

ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు 2020 డిసెంబ‌ర్‌లో ప్ర‌చురించిన ప‌రిశోధ‌న‌లో కోవిడ్ నుంచి కోలుకున్న వ్య‌క్తుల్లో క‌నీసం 8 నెల‌ల వ‌ర‌కు ఇమ్యూనిటీ పెంచే యాంటీబాడీలు ఉంటాయ‌ని అధ్య‌య‌నాల్లో తేలింది.

డిసెంబ‌ర్ లో ఇంగ్లాండ్ 12000 మందికిపైగా హెల్త్ వ‌ర్క‌ర్లు పాల్గొన్న మ‌రో అధ్య‌య‌నంలో SARS-CoV-2 బారిన ప‌డిన వారిలో యాంటీబాడీల‌ను ఉత్ప‌త్తి అవుతున్నాయ‌ని గుర్తించారు. ఇదే అధ్య‌య‌నం ప్ర‌కారం.. 1,400కంటే ఎక్కువ యాంటీబాడీ పాజిటివ్ క‌లిగిన వ్య‌క్తుల్లో కేవ‌లం ముగ్గురు వ్య‌క్తుల‌కు 2020లో ఏప్రిల్ నుంచి న‌వంబ‌ర్ మ‌ధ్య కాలంలో మ‌రోసారి క‌రోనా నిర్ధార‌ణ అయింది. చాలా వైర‌స్‌కు వ్యాపించిన‌ప్పుడు రోగ‌నిరోధ‌క శ‌క్తి ప్ర‌తిస్పంద‌న‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాయి. ఒక టీకా క‌రోనా వైర‌స్‌ను ప్ర‌భావంతంగా మాత్ర‌మే కాకుండా దీర్ఘ‌కాలిక రోగ‌నిరోధ‌క శ‌క్తిని అందించే అవ‌కాశం ఉంది.

Narendra Modi: ప్రపంచం భారత్ వైపు చూస్తోంది… ప్రవాసీ దివాస్ సదస్సులో ప్రధాని మోదీ…