Heart Disease: ఇలాంటి లక్షణాలు బలహీనమైన గుండెకు సంకేతం కావొచ్చు.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

|

Dec 04, 2022 | 9:29 AM

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన సమాచారం ప్రకారం..

Heart Disease: ఇలాంటి లక్షణాలు బలహీనమైన గుండెకు సంకేతం కావొచ్చు.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Heart Attack
Follow us on

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. కేవలం గుండె జబ్బుల కారణంగా ప్రతి సంవత్సరం 1.79 మిలియన్ల మంది మరణిస్తున్నారు. పెద్ద వారి నుంచి చిన్న వారి వరకూ అందరూ గుండె జబ్బులతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే.. హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని.. దానికి తగినట్లు జీవనశైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. గుండె బలహీనంగా ఉన్నప్పుడు, అది గట్టిగా పంపింగ్ చేయడం ప్రారంభమవుతుంది. ఈ అదనపు గుండె లయలు, పంపింగ్ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. అయితే ఈ సమస్య ఒక్కరోజులో వచ్చేది కాదు. ఈ సమస్య రోజురోజుకూ కొనసాగుతూ పోతే.. గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. కానీ గుండె బలహీనంగా ఉంటే ఈ 5 లక్షణాలు మొదటి నుంచి కనిపిస్తాయి.

  1. మైగ్రేన్: ఛాతీలో నొప్పులు, మైగ్రేన్ గుండె సమస్యను కూడా సూచిస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. సాధారణ మైగ్రేన్లు తీవ్రమైన గుండె సమస్యను సూచిస్తాయి. ఇది ప్రధానంగా తల వెనుక భాగంలో నొప్పిని కలిగిస్తుంది. కావున మొదటి నుండి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  2. కాళ్లలో వాపు: కాళ్లు ఉబ్బడం కూడా గుండె సమస్యలకు సంకేతం. మీరు తరచూ కూర్చున్నా లేదా గర్భధారణ సమయంలో కాళ్ల వాపు అనేది సర్వ సాధారణం. కాలు వాపుతో అలసటగా ఉంటే అది గుండెపోటుకు సంకేతం.
  3. శ్వాస, కండరాల్లో నొప్పి: గుండెలో అసౌకర్యంగా ఉన్నా, కండరాల్లో నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటే అది కూడా బలహీనమైన గుండెకు సంకేతం. రక్తహీనత ఉంటే, శ్వాస సమస్యలు కూడా వస్తాయి. శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ రక్తం ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
  4. కొవ్వు పేరుకుపోవడం: గుండె కవాటంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కూడా శ్వాస సమస్యలు తలెత్తుతాయి. తరచుగా తుంటి నొప్పి, కండరాల ఒత్తిడిని నిర్లక్ష్యం చేయవద్దు. ముందుగా వైద్యుడిని సంప్రదించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. అలాగే డైట్ కూడా పాటించాలి.
  5. అలసట, ఛాతీలో నొప్పి: కొంచెం నడిచినా, శ్రమించినా, మెట్లు ఎక్కినా ఛాతీలో నొప్పి వచ్చినా, ఊపిరి ఆడకపోయినా జాగ్రత్తగా ఉండండి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్య లేదా గుండె జబ్బుతో బాధపడుతూ ఉండవచ్చు. కావున నిర్లక్ష్యం చేయకుండా ముందుగా వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి