
శీతాకాలం ప్రారంభంతో డెంగ్యూ జ్వరం కేసులు పెరిగాయి. ఢిల్లీలో ఒక్క అక్టోబర్‌లోనే 1,200 కంటే ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే వారి సంఖ్య 2,000 దాటింది. ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందనే విషయం మనకు తెలిసిందే. ఇది కుట్టడం ద్వారా వ్యక్తి శరీంలో ఎరరక్త కణాలు పడిపోతాయి. ఫలితంగా తీవ్రమైన శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, దద్దుర్లు వస్తాయి. డెంగ్యూ బారిన పడిన వారు పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
డెంగ్యూ వ్యాధిగ్రస్తులు తమను తాము హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ప్రతిరోజూ 4 లీటర్ల నీరు త్రాగాలి, ఇది గరిష్ట పరిమితి. అలాగే ఇంట్లో చేసుకుని కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి వారి సూచనల ప్రకారం ఇంట్లో చేసుకుని తాగే డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని తాజా వేప ఆకులను నీటిలో వేసి మరిగించాలి. టీ మాదిరిగా రోజూ తాగాలి. దీనిని రోజూ తాగడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గించడానికి, శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి ఇది ఉపకరిస్తుంది.
యాంటీ మలేరియా, హీలింగ్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుంది. రెండు తాజా బొప్పాయి ఆకులను తీసుకుని, వాటిని మెత్తగా రుబ్బాలి. రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా నీరు కలపాలి. ఆ తరువాత వడకట్టి ఆ బొప్పాయి ఆకు రసాన్ని తాగాలి.
వేప ఆకుల్లాగే కల్మెక్ ఆకుల్లోనూ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఈ హెర్బ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ను పెంచడంలో మేలు చేస్తుంది.
దీన్ని జ్యూస్ లాగా తీసుకోవచ్చు. ముందుగా చర్మాన్ని తీసేసి ముక్కలుగా కోయాలి. అందులో ఒక గ్లాసు నీరు వేసి కలపాలి. ఇతర కూరగాయలతో కూడా తినవచ్చు.
తులసిని టీ రూపంలో తీసుకోవాలి. గ్రీన్ టీ తినేటప్పుడు, దానిలో తులసిని కలపాలి. అయితే పాలు కలుపొద్దు. తాజా తులసి ఆకులను నీటిలో మరిగించి వడకట్టాలి. కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆకులను ఉడకబెట్టి, ఆ నీటిని వడకట్టి టీ లాగా త్రాగాలి. మార్కెట్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. అయితే, దీనిని ఇంట్లో తయారు చేసుకుని తాగడమే ఉత్తమం.
మెంతులను జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. లేదంటే.. ఇతర జ్యూస్‌లలో మెంతు పొడిని వేసుకుని అయినా తాగొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..