
వేడి ఆహారాన్ని తినాలి: వేడిగా తాజాగా ఉన్న ఆహారం శరీరంలో సులభంగా జీర్ణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని ఆహారం మీ జీర్ణశక్తిని తగ్గిస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి.

ఆకలితో ఉన్నప్పుడు తినాలి: ఆకలిగా ఉన్నప్పుడు భోజనం, స్నాక్స్ లాంటివి తినాలి. అయితే.. ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా తినకూడదు. ఆకలి స్థాయికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

ఆహారాన్ని బాగా నమలాలి: ఆహారాన్ని సరిగ్గా పూర్తిస్థాయిలో నమలుతూ తినాలి. ఆహారాన్ని సరిగ్గా నమలడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.

హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి: తక్కువ నీరు తాగడం వల్ల మలబద్ధకం, తలనొప్పి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు.