Health Tips: మీ పాదాల్లో వాపు వస్తుందా? అందుకు కారణాలు ఇవే కావొచ్చు..

|

Oct 13, 2022 | 1:52 PM

చాలా మంది గంటలు గంటలు కూర్చొని పని చేస్తుంటారు. దాని కారణంగా కాళ్లు, పాదాలు వాపు వస్తుంది. కూర్చోవడం వల్ల వచ్చే వాపు సాధారణ సమస్యగా పేర్కొంటున్నారు

Health Tips: మీ పాదాల్లో వాపు వస్తుందా? అందుకు కారణాలు ఇవే కావొచ్చు..
Foot Swollen
Follow us on

చాలా మంది గంటలు గంటలు కూర్చొని పని చేస్తుంటారు. దాని కారణంగా కాళ్లు, పాదాలు వాపు వస్తుంది. కూర్చోవడం వల్ల వచ్చే వాపు సాధారణ సమస్యగా పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. అయితే, ఈ వాపు అనేక కారణాల వల్ల కూడా వస్తుందట. అలాంటి సందర్భంలో కారణం తెలుసుకుని, సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. లేదంటే ఆరోగ్య సమస్యలు మరింత ముదిరే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. పాదాల వాపునకు కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డిపెండెంట్ ఎడెమా..

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే సాధారణ సమస్యలలో పాదాల వాపు ఒకటి. ఇది ఏ వయస్సు వారికైనా వస్తుంది. కూర్చున్న సమయంలో కాళ్లకు రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల అలా వాపు వస్తుంది.

కవాటాల సమస్య..

కాలిలోని సిరలు గురత్వాకర్షణకు వ్యతిరేకంగా పని చేస్తాయి. ఈ కారణంగా సిరల లోపల కవాటాలు సరిగా పని చేయదు. రక్త సరఫరా జరగదు. ఫలితంగా పాదంలో ఒకరకమైన ద్రవాలు చేరడం వల్ల వాపు వస్తుంది.

నరాల సమస్య..

నరాల సమస్య కారణంగా కూడా కాళ్లలో వాపు వస్తుంది. పాదాలలోని చిన్న నరాలు సరిగా పని చేయకపోవడం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది. ఇది డిపెండెంట్ ఎడెమాకు పోలిక ఉంది.

వ్యర్థాలు..

గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి కారణంగా శరీరంలో కొన్ని రకాల వ్యర్థాలు పేరకుపోతాయి. ఈ ద్రవాలు గురుత్వాకర్షణ వల్ల పాదాల్లోకి ప్రవేశిస్తాయి. అలా పాదాల్లో పేరుకుపోయి వాపు రావడానికి కారణం అవుతుంది.

గర్భం..

గర్భధారణ కూడా పాదాల వాపునకు ఒక సాధారణ కారణం. శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. అంతేకాకుండా గర్బధారణ సమయంలో తక్కువగా నడవడం, తక్కువ శారీరక కదలికల వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది.

గమనిక: ఇందులో పేర్కొన్న అంశాలు వైద్య నిపుణుల అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం పేర్కొనడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..