Health Benefits With Peanuts: మనం నిత్యం వంటకాల్లో ఉపయోగించే వాటిలో పళ్లీలు కూడా ఒకటి. అందరికీ అందుబాటులో ఉండే వేరు శెనగల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్నాయని మీకుతెలుసా.? సాధారణంగా బాదం, జీడిపప్పు అందరికీ అందుబాటులో ధరల్లో ఉండవు. కాబట్టి సామాన్యునుడు కూడా కొనుగోలు చేసే వీలుండే పళ్లీల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందామా..?
వేరుశెనగల్లో ఉండే మాంగనీస్, పాస్ఫరస్ ఎముకలను బలంగా మారుస్తాయి. సాధారణంగా వయసు మళ్లీన తర్వాత ఎదుర్కొనే కీళ్ల సమస్యలకు వేరుశెనగలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కంటి చూపును మెరుగుపరచడంలో పళ్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే జింక్ శరీరానికి విటమిన్-ఎ ను అందిస్తాయి. కంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే పళ్లీలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఇటీవల రొమ్ము క్యాన్సర్ సమస్య బాగా పెరుగుతోంది. మారుతోన్న జీవన శైలి కారణంగా ఈ తరం స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే వేరుశెనగలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే రొమ్ము క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె పదిలంగా ఉండాలంటే పళ్లీలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
షుగర్‌తో బాధపడేవారు వేరుశెనగను స్నాక్స్ రూపంలో తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని బ్లడ్, షుగర్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయని పరిశోధనల్లో తేలింది. వేరుశెనగల్లో ఉండే మెగ్నిషియం బ్లడ్, షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
చర్మ సంరక్షణలోనూ పళ్లీలు కీలకపాత్ర పోషిస్తాయి.. వీటిలో ఉండే విటమిన్-బి3, నియాసిన్.. చర్మం ముడతలు పడకుండా కాపాడటంతో పాటు ఇతర చర్మ సమస్యలు రాకుండా చూసుకుంటాయి.
Also Read: Blue Rice: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బ్లూరైస్’… ఎలా రెడీ చేయాలో తెలుసా ?