Telugu News Health Health benefits of sugarcane juice mixed with lemon and ginger
Sugarcane Juice: వేసవి దాహార్తిని తీర్చే ప్రకృతి ప్రసాదిత వరం చెరకు రసం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
Sugarcane Juice Benefits: వేసవికాలం(Summer Season)వచ్చిందంటే చాలు.. చల్లచల్లని పదార్ధాలు తినాలని కోరుకుంటాం.. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం చాలామంది శీతల పానీయాల(Cool Drinks) వైపు చూస్తారు..
Sugarcane Juice Benefits: వేసవికాలం(Summer Season)వచ్చిందంటే చాలు.. చల్లచల్లని పదార్ధాలు తినాలని కోరుకుంటాం.. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం చాలామంది శీతల పానీయాల(Cool Drinks) వైపు చూస్తారు. కానీ వీటికంటే.. ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీరు, పుదీనా వాటర్, మజ్జిగ, చెరకు రసం వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. ఇవి దాహార్తిని తీర్చడమే కాదు.. ఆరోగ్యానికి మేలు కూడా చేస్తాయి. వేసవి ఎక్కువగా చెరకు రసం తీసుకోవడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా చెరకు రసంలో అల్లం, నిమ్మకాయ కలిసి తీసుకునే ఆ రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. స్వచ్ఛంగా తక్కువధరకు లభించే ప్రకృతి ప్రసాదిత చెరుకు రసం వేసవి తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈరోజు తెలుసుకుందాం..
చెరకులో ఎక్కువశాతం కాల్షియంఉంది. దీంతో ఎముకలు, దంతాలుఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చిన్నపిల్లల వెన్నెముక బలంగా మార్చి ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది.
వేసవిలో అలసట ఈజీగా వస్తుంది. దీంతో తక్షణ శక్తి కోసం గ్లాసు చెరకురసం తాగితే చాలు.. ఇందులో ఉండే సూక్రోజు కారణంగా నీరసాన్ని తగ్గించి శక్తినిస్తుంది.
కాలేయంలో చేరే వ్యర్ధాలను తొలగించడానికి మంచి ఆహారం చెరకు రసం. గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తాగితే, కాలేయ పని తీరు మెరుగుపడుతుంది.
వేసవిలో వడదెబ్బ తగలకుండా పిల్లలకు ఉపశమనం ఇస్తుంది. పిల్లల్లోవ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది.
జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం చెరకు రసంలో ఉంది. దీంతో ఇది అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచుతుంది.
శరీరంలో అధికబరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికీ చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఈ రసం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.
గొంతు నొప్పితో ఇబ్బంది పడేవారు గ్లాసు చెరకు రసానికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్లఉప్పు కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
రొమ్ము కాన్సర్ బారినపడకుండా కాపాడే ఔషధగుణాలు కూడా ఈ రసంలో ఉన్నాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్ కణాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలాయి.