Giloy Benefits
కరోనా మహమ్మారి ప్రపంచానికి ఎంతో నష్టం కలిగించింది. దీంతోపాటు ప్రజలకు ఆరోగ్యం గురించి మరింత అవగాహన కల్పించింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు ఆయుర్వేద నివారణల గురించి తెలుసుకున్నారు. దీంతోపాటు దేశీయ మూలికలపై కూడా నమ్మకాన్ని పెంచుకున్నారు. అలాంటి ఆయుర్వేద ఔషధంలో తిప్పతీగ కూడా ఒకటి.. తిప్పతీగ అనేక ఔషధ గుణాల గని. ఇది వేగంగా బరువు తగ్గేలా చేయడంతోపాటు శరీరానికి ఇతర గొప్ప ప్రయోజనాలను కూడా అందిస్తుంది. తిప్పతీగ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- శరీరంలో పెరిగిన కొవ్వు కరిగిపోతుంది: వేగంగా పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతుంటే.. తిప్పతీగతో పుల్ స్టాప్ పెట్టొచ్చు.. బరువును తగ్గించుకోవడానికి ఆహారంలో దీనిని చేర్చుకోవాలి. వాస్తవానికి ఈ ప్రయోజనకరమైన మొక్కలో అడిపోనెక్టిన్, లెప్టిన్ అనే మూలకాలు కనిపిస్తాయి. ఈ మూలకాలు శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. దీని కారణంగా శరీర ఆకృతి మెరుగుపడుతుంది.
- ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది: మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే.. తిప్పతీగతో చెక్ పెట్టొచ్చు. క్రమం తప్పకుండా తిప్పతీగను తీసుకోవడం ద్వారా నిద్ర బాగా రావడమే కాకుండా ఒత్తిడి స్థాయి కూడా చాలా వరకు అదుపులోకి వస్తుంది. దీని ద్వారా మీరు చింత లేకుండా జీవితాన్ని గడపవచ్చు.
- రోగనిరోధక శక్తి బలపడుతుంది: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. తిప్పతీగలోని మూలకాలు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే కాకుండా శరీరం నుంచి ప్రమాదకరమైన టాక్సిక్ యాంటీఆక్సిడెంట్లను తొలగించడానికి కూడా పని చేస్తాయి. దీని వినియోగం శరీరంలోని కణాలను బలపరుస్తుంది. ఇది వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.
- మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది: మధుమేహం లేదా బ్లడ్ షుగర్ ఉన్నవారికి తిప్పతీగ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తిప్పతీగ జ్యూస్ తాగవచ్చు. ఈ జ్యూస్ కొంచెం చేదుగా ఉన్నా షుగర్ లెవెల్ ని చాలా వరకు కంట్రోల్ లోకి తెస్తుంది.
- కడుపు నొప్పి దూరమవుతుంది: కడుపు నొప్పితో బాధపడేవారు కూడా తిప్పతీగ నుంచి ఉపశమనం పొందవచ్చు. అజీర్ణం, అసిడిటీ లేదా కడుపునొప్పితో బాధపడేవారు తిప్పతీగ రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..