Haldi Ceremony: పెళ్లికి ముందు వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారో తెలుసా.. దీని వెనుక సైన్స్ ఉందండోయ్..

|

Feb 24, 2023 | 10:52 AM

పెళ్లికి ముందు వధూవరులకు పసుపు రాసే ఆచారం ఉంది. దీని కోసం ఒక కార్యక్రమం ఉంచుతారు. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..

Haldi Ceremony: పెళ్లికి ముందు వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారో తెలుసా.. దీని వెనుక సైన్స్ ఉందండోయ్..
Haldi Ceremony
Follow us on

వివాహ సీజన్‌లో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. దాదాపు ప్రతి మతానికి చెందిన వారు వివాహ వేడుకలో ముందుగా నిర్వహించే సమయంలో తప్పకుండా హల్దీ ఫెస్టివల్ నిర్వహిస్తారు. పసుపు రాసి స్నానం చేయించనిదే.. ఏ పెళ్లి జరగదు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే పసుపునకు ప్రాధన్యతనిస్తూ.. హల్దీ వేడుక చేసుకుంటున్నారు. వివాహానికి ముందు అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి హల్దీ వేడుక. వివాహ వేడుకలను స్టార్ట్ చేయడానికి వధూవరులకు.. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కలిసి.. పెండ్లి కూతురు, పెళ్లి కొడుకు ముఖాలు, చేతులు, పాదాలకు పసుపు రాస్తారు. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఈ పసుపు అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. పసుపు ఆహారానికి రంగు, రుచిని జోడించడమే కాకుండా.. అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. గాయాలు,కాలిన గాయాలకు చికిత్స చేయడానికి హల్దీని క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. జీర్ణకోశ, అనేక ఇతర వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ ఆచారాన్ని నిర్వహించడానికి.. పసుపును నూనె, నీటితో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. అంతెందుకు మన పెద్దల కాలం నుంచి ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు. దాని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా..

పసుపును చర్మంపై పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. చర్మం మెరిసిపోతుంది

మన అమ్మమ్మల కాలంలో బ్యూటీ పార్లర్లు ఈనాటిలా లేవు, అప్పట్లో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి సహజసిద్ధమైన, ఆయుర్వేద పద్ధతులే ఉపయోగించేవారు. పసుపు చర్మానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇది ముఖంతో సహా మొత్తం శరీరాన్ని మెరుగుపరుస్తుంది. పెళ్లి రోజు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పసుపు ద్వారా వధూవరుల ముఖం కాంతివంతంగా ఉంటుంది.

2. క్రిమినాశక లక్షణాలు

మనం పసుపును మసాలాగా ఉపయోగించవచ్చు. కానీ దానిని చర్మంపై పూసినట్లయితే.. అది ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు. వాస్తవానికి, పసుపులో క్రిమినాశక లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఔషధ గుణాలు కలిగిన మసాలాగా చెప్పవచ్చు. దీని కారణంగా, వధూవరుల చర్మంపై ఉండే గాయాలు, పొట్టు గుర్తులు మాయమవుతాయి. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే క్రిములు నాశనం అవుతాయి.

3. స్కిన్ క్లీన్ అవుతుంది

పసుపుకు భారతీయ సంప్రదాయంలో అంత ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లికి ముందు కొత్త జంటల శరీరంపై పసుపును పూస్తారు. ఎందుకంటే ఇది ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పసుపు రాసుకుని స్నానం చేస్తే చర్మం నిర్విషమై మృతకణాలు తొలగిపోతాయి.

4. పొడి చర్మానికి మేలు చేస్తుంది

పసుపు చర్మం పొడిగా ఉన్న వారికి ఔషధం కంటే తక్కువ కాదు. ఇది చర్మానికి తేమను.. పోషణను అందిస్తుంది. పసుపును పూయడం వల్ల పొడి చర్మంలో పగుళ్లను నింపడం ప్రారంభమవుతుంది. పెళ్లి కాకుండా ఇతర రోజులలో కూడా పసుపు రాసుకుంటే చర్మం బాగా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం