Ground Nut: వేరుశెనగతో ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.. రోజూ గుప్పెడు వేరుశెనగలు తినేయండి!

|

Sep 12, 2021 | 10:07 PM

వేరుశెనగ ప్రతిరోజూ తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచింది. ప్రత్యేకించి కొన్ని ప్రాణాంతక వ్యాధులను ఇది దగ్గరకు రానీయదని పరిశోధకులు చెబుతున్నారు.

Ground Nut: వేరుశెనగతో ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.. రోజూ గుప్పెడు వేరుశెనగలు తినేయండి!
Ground Nut Benefits
Follow us on

Ground Nut:  వేరుశెనగ తినే ఆసియా ప్రజలు గుండె జబ్బుల ప్రమాదం నుంచి దూరంగా ఉంటారు. జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు.  జపాన్‌లో నివసిస్తున్న ఆసియా మహిళలు, పురుషులు రోజూ సగటున 4-5 వేరుశెనగ పండ్లను తింటే ఇస్కీమిక్ స్ట్రోక్.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

స్ట్రోక్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, వేరుశెనగ తినే వ్యక్తులలో ఇటువంటి వ్యాధుల కేసులు పర్యవేక్షించారు.  పరిశోధకుడు సత్యో కేహరా మాట్లాడుతూ, మొదటిసారి, ఎక్కువ వేరుశెనగలను తినేవారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని ఆసియా ప్రజలలో గమనించినట్లు చెప్పారు.  మా పరిశోధనలో వేరుశెనగలను ఆహారంలో చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది అని ఆయన వివరించారు. 

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం కోసం వేరుశెనగ అనేక సార్లు ప్రజలకు ఎలా  ఉపయోగపడుతుందనే దానిపై పరిశోధన జరిగింది. రెండు దశల్లో ఈ పరిశోధన జరిపారు. మొదటి పరిశోధన 1995 లో జరిగింది. రెండవ పరిశోధన 1998 – 1999 మధ్య జరిగింది. ఈ పరిశోధనలో 74,000 మంది ఆసియా మహిళలు, పురుషులు పాల్గొన్నారు. వారి సగటు వయస్సు 45 నుండి 74 సంవత్సరాలు.

పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులను వారు రోజూ లేదా వారంలో ఎంత వేరుశెనగ తిన్నారో అడిగారు. ఈ వ్యక్తులు తదుపరి 15 సంవత్సరాలు పర్యవేక్షణలో ఉన్నారు. 

ఉప్పు లేకుండా వేరుశెనగ తినండి

పరిశోధకుడు చెబుతున్న దాని ప్రకారం  ఆసియా దేశాలలో వేరుశెనగ..గింజలను తినే అలవాటు చాలా తక్కువ. అయితే,  రోజువారీ జీవితంలో చేర్చడం వల్ల ప్రమాదం తగ్గుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న దానికి ప్రకారం, వారానికి ఐదు సార్లు, 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగలను ఉప్పు లేకుండా తినాలి.

వేరుశెనగ ఎందుకు

వేరుశెనగలో గుండెకు నేరుగా ఉపయోగపడే అనేక విషయాలు ఉన్నాయి. మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు మరియు ఫైబర్ వంటివి. ఇది అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తుంది. దీనితో పాటు, అవి గుండె మంటను తగ్గించడానికి కూడా పని చేస్తాయి. ఈ విధంగా అనేక గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

Also Read: Harassments on Men: మహిళలపై గృహహింస అందరికీ తెలుసు.. పురుషులూ వేధింపులకు గురవుతారు.. మీరు నమ్మగలరా?

Used Cars: సెకండ్ హ్యాండ్ కారుకు బ్యాంకు లోను కోసం ప్రయత్నిస్తున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటో తెలుసుకోండి!