
డయాబెటీస్.. ప్రపంచంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల వ్యాధి. వచ్చిందంటే జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. షుగర్ వచ్చిన వాళ్లకు దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఇదివరకు పెద్ద వాళ్లకు మాత్రమే వచ్చే డయాబెటీస్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తోంది.
ఈ రోజు మానవాళిని భయపెడుతున్న సైలెంట్ కిల్లర్ డయాబెటిస్ గురించి అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవడంతో కొంతైనా తగ్గంచుకోవచ్చు. ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్ రాజధానిగా మారుతోంది – కోట్లాది మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు.
గతంలో 40–50 ఏళ్ల వారిలోనే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు 15–20 ఏళ్ల యువతలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రులకు వచ్చే 30 శాతం మంది మధుమేహ రోగుల్లో 20–30 ఏళ్ల యువకులే ఎక్కువగా ఉంటున్నారు. కొందరు 10–15 ఏళ్ల పిల్లలకే డయాబెటిస్ స్టార్ట్ అవుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు, ఒబెసిటీ ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ తయారీ తగ్గుతుంది. జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి.
ఇది 90 శాతం కేసుల్లో కనిపిస్తుంది. జీవనశైలి మార్పులతోనే దీనిని పూర్తిగా నియంత్రించవచ్చు. లేదా రివర్స్ కూడా చేయవచ్చు.
యువతలో టైప్-2 డయాబెటిస్ పెరగడానికి కారణం అధిక బరువు. పిల్లల్లోనే ఊబకాయం పెరుగుతోంది. ఇది డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణమవుతుంది.
రోజూ 30–45 నిమిషాల వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం (పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు), రాత్రి 7–8 గంటల నిద్ర, ఒత్తిడి తగ్గించడంతో నివారణ సాధ్యమవుతుంది. బరువు 5–10 శాతం తగ్గితే డయాబెటిస్ రాకుండా ఆపవచ్చు. ఉన్నప్పటికీ నియంత్రణలోకి ఉంచుకోవచ్చు. డయాబెటిస్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. అయితే, దాన్ని దరి చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.