ఈ పువ్వులన్నీ మీ అందాన్ని పెంచుతాయి.. అది ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి

కొన్ని ప్రత్యేకమైన పూలు మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి సహజ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచడంలో చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ విషయం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఈ పువ్వులన్నీ మీ అందాన్ని పెంచుతాయి.. అది ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి
Flowers Teas For Radiant Skin

Updated on: Apr 21, 2025 | 8:14 PM

కొన్ని ప్రత్యేకమైన పూలు మన ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ పూలను స్మూతీల్లో, టీల్లో లేదా వంటల్లో జోడించటం ద్వారా మీరు ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. ప్రతి పువ్వు అందాన్ని పెంచడానికి ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మందారం

మందారం పూలలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. మందారం పూలను టీలో వేసి తాగడం వల్ల ముఖం మెరుగుపడుతుంది. ఇవి చర్మంపై శుభ్రమైన, ప్రకాశవంతమైన టోన్ ని ఇచ్చేందుకు సహాయపడుతాయి.

గులాబీ

గులాబీ పువ్వులు చర్మానికి హైడ్రేషన్ ని అందిస్తాయి. వీటి సహజ లక్షణాలు చర్మాన్ని తడిగా ఉంచి అందాన్ని రెట్టింపు చేస్తాయి. గులాబీ పువ్వులతో బాదం పాల స్మూతీ తయారు చేసి తాగడం ద్వారా చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. అలాగే గులాబీ పూలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణను అందిస్తాయి.

లావెండర్

లావెండర్ పూలు చర్మానికి శాంతియుత ప్రభావాన్ని చూపుతాయి. ఇవి చర్మం పై ఉన్న వాపులను తగ్గిస్తాయి. అలాగే చర్మానికి మృదువైన శుభ్రతను కూడా అందిస్తాయి. ఈ పూలను స్మూతీల్లో కలిపి ఉపయోగించడం ద్వారా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

క్యాలెండులా (బంతిపూలు)

క్యాలెండులా పువ్వులు నారింజ రంగులో ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గాయాలను త్వరగా మాన్పించడంలో, చర్మంపై ఉండే మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. క్యాలెండులా పువ్వులు చర్మం మెరుగుపడటానికి సహాయపడుతాయి.

చామంతి

చామంతి పువ్వులు కూడా అందాన్ని పెంచే పూలలో ఒకటి. వీటితో తయారైన స్మూతీలు చర్మానికి చాలా మంచివి. ఈ పువ్వులు ముఖంపై ఉన్న వాపును తగ్గించి ముఖం మీద ప్రకాశం పెంచుతాయి. చామంతి పువ్వులలో ఉండే పోషకాలు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

నాస్టూర్టియం

నాస్టూర్టియం పువ్వులు స్మూతీల్లో జోడించడానికి మంచి పువ్వులు. వీటిలో విటమిన్ C, ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ పువ్వులు చర్మాన్ని మరింత మెరుగుపరచడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా ఆరోగ్యంగా మారుతుంది.

శంఖు పువ్వులు

శంఖు పువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి‌తో బ్లూ టీ తయారు చేసి తాగితే చర్మ ఆరోగ్యం మెరుగవడంతో పాటు శరీరానికి కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. శంఖు పువ్వుల సహాయంతో చర్మం శక్తివంతంగా, మెరుగైన టోన్ లో కనిపిస్తుంది.

ఈ పూలతో ఇలా మీరు మీ చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. ప్రతి పువ్వు శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి, చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)