Fenugreek Seeds: మెంతి గింజలే కదా అని తీసి పారేయకండి.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు!

|

Oct 23, 2024 | 5:46 PM

మెంతి గింజల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు, అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. వివిధ రకాల సమస్యలను తగ్గించుకునేందుకు, బరువు తగ్గేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదు. కానీ మెంతి గింజలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.

Fenugreek Seeds: మెంతి గింజలే కదా అని తీసి పారేయకండి.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు!
మొలకెత్తిన మెంతి గింజల్లో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్ సితో పాటు విటమిన్ ఎ, బి కూడా ఇందులో ఉంటాయి. అంతేకాకుండా, మొలకెత్తిన మెంతులు ప్రోటీన్, కాల్షియం, ఫైబర్‌తోపాటు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.
Follow us on

Fenugreek Seeds: భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేటి కాలంలో ఊబకాయం ఒక పెద్ద సమస్య. ఊబకాయం, పొట్ట కొవ్వు మీ వ్యక్తిత్వాన్ని పాడుచేయడమే కాకుండా అనేక వ్యాధులకు కారణం అవుతుంది. అందువల్ల దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. కానీ జీవనశైలిలో చిన్న మార్పు కూడా మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో చాలా సహాయకారిగా ఉంటుంది. కొన్ని పద్దతులను అనుసరించడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మెంతి గింజలను ఆంగ్లంలో fenugreek Seeds అంటారు. మెంతి గింజల వాడకం బరువు తగ్గించడంలో, పొట్టను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. మెంతి గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మళ్లీ మళ్లీ ఆకలి అనిపించదు. పీచుతో పాటు, మెంతి గింజల్లో మంచి మొత్తంలో రాగి, రిబోఫ్లావిన్, విటమిన్ ఎ, బి6, సి, కె, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి శరీరానికి లోపల నుండి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మెంతి గింజలను ఎలా తీసుకోవాలోతెలుసుకుందాం.

మెంతి గింజలు నీరు:

మెంతి గింజలను తినడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, రాత్రిపూట ఒక గ్లాసులో 1 నుండి 2 స్పూన్ల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టి ఉంచడం. మరుసటి రోజు ఉదయం ఈ నానబెట్టిన గింజలు ఉన్న నీటిని కొద్దిగా వేడి చేసి, వడపోసి తాగాలి. మీకు కావాలంటే మీరు నానబెట్టిన మెంతి గింజలను కూడా తినవచ్చు లేదా ఈ గింజలతో ఫేస్ ప్యాక్ లేదా హెయిర్ మాస్క్ తయారు చేసి వాటిని అప్లై చేసుకోవచ్చు.

మెంతి గింజల నీటిని తాగడం ద్వారా జీవక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలోని అదనపు కొవ్వు కాలిపోతుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ నీళ్లలో ఎన్నో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నందున చర్మానికి ఎంతో బెనిఫిట్‌.

మెంతి గింజల టీ:

మెంతి గింజల నీరు కాకుండా, మెంతి గింజల నుండి కూడా టీ తయారు చేయవచ్చు. దీని కోసం మీరు మెంతులు గింజలను ఒక పాత్రలో వేసి నీటితో బాగా మరిగించాలి. నీరు మరిగేటప్పుడు దానిని ఒక కప్పులో ఫిల్టర్ చేయండి. ఈ టీ తాగడం వల్ల మీకు పెద్దగా ఆకలి అనిపించదు. పదే పదే ఏదైనా తినాలనే కోరిక ఉండదు. మెంతి గింజల ఈ టీని ఉదయం లేదా సాయంత్రం తాగవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి