Health: మహిళల కంటే పురుషుల్లోనే ఆ ముప్పు ఎక్కువ.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతులు

|

Jul 10, 2022 | 11:25 AM

పెరిగిపోతున్న సాంకేతికత, జీవన విధానంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పూర్వం పెద్ద వయసులో వచ్చే వ్యాధులు ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గుండెపోటు ముప్పు ఎక్కువైంది. మంచి ఆహారం తీసుకోవడం, సరైన...

Health: మహిళల కంటే పురుషుల్లోనే ఆ ముప్పు ఎక్కువ.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతులు
Health Tips
Follow us on

పెరిగిపోతున్న సాంకేతికత, జీవన విధానంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పూర్వం పెద్ద వయసులో వచ్చే వ్యాధులు ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గుండెపోటు ముప్పు ఎక్కువైంది. మంచి ఆహారం తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని పాటిస్తే ఈ అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆడవారిలో కంటే ఎక్కువగా మగవారిలో గుండెపోటు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి మగవారి గుండెకి, ఆడవారి గుండెకి ఎటువంటి తేడాలు లేవు. మహిళల గుండె సాధారణంగా చిన్నగా ఉంటుంది, దానిలో కొన్ని అంతర్గత గదులు ఉంటాయి. ఈ గదులను విభజించే గోడలు సన్నగా ఉంటాయి. స్త్రీ గుండె పురుషుడి గుండె కంటే వేగంగా పని చేస్తుంది. కానీ పురుషులలో ఇలా కాదు. పురుషులు ఒత్తిడికి గురి అయినప్పుడు వారి గుండె ధమనులు కుంచించుకుపోతాయి. వారి రక్తపోటు కూడా పెరుగుతుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి లక్షణాలు, చికిత్సలు, ఫలితాలలో జెండర్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

ఆడవారిలో కూడా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. కానీ.. వారిలో ఎక్కువగా మెనోపాజ్ దశ దాటిన తరువాత మాత్రమే ఈ వ్యాధి వస్తోంది. గుండెపోటు లక్షణాలు మగవారిలో, ఆడవారిలో వేరు వేరుగా ఉంటున్నాయి. గుండెపోటుతో బాధపడుతున్న స్త్రీలకు షుగర్ లేదా హైబీపీ వంటి వ్యాధులు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఏది ఏమైనా గుండె పోటు అనేది చాలా సున్నితమైన సమస్య. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటి మార్పులతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

హెల్త్ వార్తల కోసం..