
ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను తినాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బాదంపప్పులను మాత్రమే కాకుండా వాల్‌నట్‌లనూ రాత్రి పూట నానబెట్టి ఉదయం తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ గుండె, ఎముకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అల్పాహారం, స్మూతీ లేదా పోషకమైన చిరుతిండిలో వీటిని భాగం చేసుకుంటే దీర్ఘ కాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, విటమిన్ B6 అందిస్తాయి. ఇవి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులూ అధికంగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు హానికరమైన కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి వాల్ నట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.
వాల్ నట్స్ లో ఉండే పోషక పదార్థాలు హృదయనాళ వ్యవస్థ, ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా పిత్తాశయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మూర్ఛ చికిత్సలో వాల్‌నట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే వీటిని నానబెట్టి తీసుకుంటే వీటి ప్రయోజనాలు అధికమవుతాయి. వాల్‌నట్‌లను నానబెట్టడం వల్ల వాటి జీర్ణశక్తి పెరుగుతుంది. ఫైటిక్ యాసిడ్, టానిన్ ను తగ్గిస్తుంది. వాల్‌నట్‌లను నానబెట్టి తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అజీర్ణాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది పోషకాల లభ్యతను కూడా పెంచడమే కాకుండా పాలీఫెనాల్స్‌ను తగ్గిస్తుంది.
సాధారణంగా, 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టిన 2-4 వాల్‌నట్‌లను తినండ వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సూపర్‌ఫుడ్ ప్రయోజనాలు పొందడానికి ఇతర డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లోనూ, సాయంత్రం స్నాక్స్ లోనూ యాడ్ చేసుకోవచ్చు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..