High Uric Acid: జాగ్రత్త.. ఈ పొరపాట్లు చేస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.. ఎంటంటే..

|

Apr 01, 2022 | 1:31 PM

యూరిక్ యాసిడ్ మనందరి శరీరంలో ఉంటుంది. ఇది మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయబడిన తర్వాత శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. యూరిక్ యాసిడ్ ఏర్పడటం ఒక వ్యాధి కాదు.. కానీ అది శరీరం నుంచి బయటకు రాకపోవడం సమస్య..

High Uric Acid: జాగ్రత్త.. ఈ పొరపాట్లు చేస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది..   ఎంటంటే..
High Uric Acid
Follow us on

ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల జీవితం.. గతి తప్పిన జీవనశైలి ఫలితం యూరిక్ యాసిడ్ ప్రభావం మన శరీరంపై పడుతుంది. యూరిక్ యాసిడ్ మనందరి శరీరంలో ఉంటుంది. ఇది మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయబడిన తర్వాత శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. యూరిక్ యాసిడ్ ఏర్పడటం ఒక వ్యాధి కాదు.. కానీ అది శరీరం నుంచి బయటకు రాకపోవడం సమస్య. శరీరంలో ప్యూరిన్ మొత్తంలో పెరుగుదల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదలకు దారితీస్తుంది. ప్యూరిన్ అనేది మానవ శరీరంలోని ప్రతి కణంలో కనిపించే సేంద్రీయ సమ్మేళనం. శరీరంలో ప్యూరిన్ అధిక మొత్తంలో ఉన్నప్పుడు, కిడ్నీ దానిని జీర్ణించుకోలేకపోతుంది. కండరాలలో స్ఫటికాల రూపంలో గట్టిపడటం ప్రారంభిస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల అనేక సమస్యలకు దారితీస్తుంది.

యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో కీళ్లలో చేరడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులు, కాలి నొప్పి, కాలి వాపు వంటి సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఉదయాన్నే చీలమండలలో భరించలేని నొప్పి వస్తుంది.

యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి ఆహారంలో తీసుకునే వాటిపైనే ఆదారపడి ఉంటుంది. కానీ చెడు జీవనశైలి కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని వేగంగా పెంచుతుంది. మన జీవనశైలి కారణంగా తలెత్తే కొన్ని తప్పుల కారణంగా యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఇది సరిదిద్దడం చాలా ముఖ్యం. యూరిక్ యాసిడ్ స్థాయిని వేగంగా పెంచడానికి కారణమయ్యే తప్పులు ఏమిటో తెలుసుకుందాం.

ఊబకాయం: అధిక బరువు ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఊబకాయం ఉన్నవారిలో తక్కువ బరువు ఉన్నవారి కంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. బరువు సాధారణంగా ఉన్నవారిలో వారి యూరిక్ యాసిడ్ కూడా సాధారణంగా ఉంటుంది.

నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం: నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి. నాన్ వెజ్‌లో ప్యూరిన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.

పెరుగు: ఆయుర్వేదం ప్రకారం, పుల్లని పదార్థాలు యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి, కాబట్టి వాటిని నివారించడం చాలా ముఖ్యం. పెరుగు రుచి కూడా పుల్లగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ రోగుల సమస్యను పెంచుతుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెరుగు యూరిక్ యాసిడ్ సమస్యను పెంచుతుంది. కాబట్టి దీనిని నివారించండి.

ఆల్కహాల్, సిగరెట్ అలవాటు : ఆల్కహాల్, సిగరెట్లు తీసుకోవడం యూరిక్ యాసిడ్ స్థాయిని వేగంగా పెంచుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం అనేది అనారోగ్యకరమైన అలవాట్లు, దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ బయటకు వెళ్లలేవు. టాక్సిన్ లేకపోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..