Honey For Hair: తేనె వల్ల జుట్టు తెల్లబడుతుందా..? జుట్టు ఆరోగ్యానికి తేనెను ఎలా ఉపయోగించాలి..?

తేనే వల్ల జుట్టు తెల్లబడుతుందా..? జుట్టు రంగు మెలనిన్ పిగ్మెంట్ వల్ల వస్తుంది. ఇది జుట్టు వేర్లలోని మెలనోసైట్స్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. తేనెలో గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనే పదార్థం ఉంది. ఇది తక్కువ స్థాయిలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇది జుట్టు రంగు మార్చడానికి సరిపోదు.

Honey For Hair: తేనె వల్ల జుట్టు తెల్లబడుతుందా..? జుట్టు ఆరోగ్యానికి తేనెను ఎలా ఉపయోగించాలి..?
Honey For Hair

Updated on: Jan 25, 2025 | 10:13 AM

తేనే వల్ల జుట్టు తెల్లబడుతుందా..? మనలో కొంతమంది తేనే తలపై పడితే జుట్టు తెల్లబడుతుందని నమ్ముతుంటారు. జుట్టు తెల్లబడటానికి గల అసలు కారణాలను, తేనెకు సంబంధించి ఉన్న తప్పుడు నమ్మకాలపై వైద్య నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రంగులో మార్పు

మన జుట్టు వేర్ల వద్ద ఉండే హేర్ ఫాలికల్స్ లో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ మెలనిన్ పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్లే జుట్టుకు నల్లటి రంగు వస్తుంది. కొన్ని సందర్భాల్లో జన్యు మార్పులు లేదా వయసు ప్రభావం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో జుట్టు రంగు క్రమంగా తెల్లబడుతుంది. ఇది సహజమైన ప్రక్రియ కాగా.. తేనె వల్ల జుట్టు తెల్లబడడం అనేది శాస్త్రీయంగా అవాస్తవమని నిపుణులు తెలిపారు.

తేనెలోని పదార్ధాలు

తేనెలో గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనే పదార్థం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇది నీటితో లేదా తేమతో కలిసినప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ రంగు మార్చే లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ, తేనెలో ఇది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా తేనె నుంచి వచ్చిన హైడ్రోజన్ పెరాక్సైడ్ జుట్టు రంగును మార్చలేని స్థాయిలో ఉండటం వల్ల, తేనె వల్ల జుట్టు తెల్లబడటం అనేది అసంభవమట.

తేనే ద్వారా జుట్టు తెల్లబడుతుందా..?

తేనే వల్ల జుట్టు తెల్లబడుతుందని చెప్పడం ఒక అపోహ మాత్రమే. తేనెను తలకు రాయడం వల్ల హానికరమైన ప్రభావాలు ఉండవు. తేనెలో ఉన్న పోషకాలు తల చర్మానికి మేలు చేస్తాయని మాత్రమే శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాకుండా తేనెను నేరుగా తలకు రాసినప్పటికీ.. ఇది జుట్టు రంగును మార్చే శక్తిని కలిగి ఉండదు. తేనెకు సంబంధించిన శాస్త్రీయ పరిశీలనల్లో కూడా ఇలాంటి ప్రభావాలపై ఎలాంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.

తేనే వల్ల జుట్టు తెల్లబడుతుందని నమ్మి దీన్ని దూరంగా పెట్టడం సరైనది కాదు. తేనె ప్రకృతి సమృద్ధి కలిగిన అద్భుతమైన పదార్థం. ఇది ఆరోగ్యానికి, చర్మానికి ప్రయోజనకరమైన గుణాలు కలిగి ఉంది. రసాయన పదార్థాలు కలిగిన రంగులతో పోల్చితే తేనెలో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి తేనెను ఉపయోగించడం వల్ల జుట్టు తెల్లబడుతుందని అనుకోవడం శాస్త్రీయంగా అవాస్తవం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)