
ప్రతి ఒక్కరు ఉదయం లేచాక పళ్ళు తోముకోవడం అనేది సాధారణ పరిశుభ్రతా అలవాటు. కానీ కొంతమంది పళ్ళను 10–15 నిమిషాలు రుద్దుతూ, అంతేకాకుండా మౌత్ వాష్ కూడా తరచుగా వాడతారు. ఇవి సోషల్ మీడియాలో ప్రోత్సహించే అలవాట్లుగా మారాయి. మనకు రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకోవాలని సిఫార్సు చేస్తారు. కానీ, ఎక్కువ మౌత్ వాష్ వాడటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చని పరిశోధనలు చూపిస్తున్నాయి. నోటిలో మనకు సహాయపడే “మంచి బ్యాక్టీరియా” ఉంటాయి, ఇవి ఆహారంలోని నైట్రేట్ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చడానికి సహాయపడతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విశ్రాంతి తీసుకోవడానికి, రక్తపోటును నియంత్రించడానికి కీలకమైనది.
తరచుగా యాంటీ-బ్యాక్టీరియల్ మౌత్ వాష్ వాడడం వల్ల ఈ మంచి బ్యాక్టీరియా చనిపోతాయి. ఫలితంగా, అధిక రక్తపోటు, మధుమేహం (డయాబెటిస్) వచ్చే అవకాశం పెరుగుతుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం దాదాపు 1,000 మందిని మూడు సంవత్సరాల పాటు పరిశీలించిన ఒక అధ్యయనంలో, రోజుకు రెండు సార్లు మౌత్ వాష్ వాడిన వారికి ప్రీడయాబెటిస్ లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం 55% ఎక్కువగా ఉన్నట్టు తేలింది. మరొక పరిశోధనలో, అదే అలవాటు ఉన్నవారికి అధిక రక్తపోటు ప్రమాదం రెట్టింపు అయినట్లు కనుగొన్నారు.
ముఖ్యంగా, క్లోర్‌హెక్సిడైన్ వంటి బలమైన యాంటీ-బ్యాక్టీరియల్ మౌత్ వాష్‌లు వైద్య సలహా మేరకు మాత్రమే వాడాలి. సాధారణ ఫ్లోరైడ్ మౌత్ వాష్ లేదా బెటాడిన్ మౌత్ వాష్ రోజూ ఉపయోగించవచ్చు; ఇవి మంచి బ్యాక్టీరియాకు హాని చేయవు.
తదుపరి సూచనల ప్రకారం, నోటిని శుభ్రం చేయడానికి.. రోజుకు రెండు సార్లు పళ్ళు తోమడం, ఫ్లాసింగ్ చేయడం, మౌత్ వాష్‌ను వైద్య సూచనల ప్రకారం మాత్రమే వాడడం.. ఈ మూడు అలవాట్లతో నోటీ పరిశుభ్రతను రక్షించడం, అలాగే హృదయ ఆరోగ్యం, రక్తపోటు, మధుమేహ నియంత్రణలో సహాయపడుతుంది.