
గుడ్ల తినడం వల్ల మన ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయి. అందుకే గుడ్లను సూపర్ ఫుడ్ అంటారు. అద్భుతమైన రుచితోపాటు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కూడా కలిగి ఉంటాయి. గుడ్డులోని తెల్లనిసొన లేదా పచ్చ సొన అయినా.. మొత్తం గుడ్డును తినడం ఎంతో ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు. గుడ్డులోని తెల్లసొన ప్రధానంగా ప్రొటీన్, నీటితో తయారవుతుంది. పచ్చసొనలో ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. గుడ్లు దగ్గు, జలుబుకు ప్రత్యక్ష నివారణ కానప్పటికీ.. వర్షాకాలంలో దగ్గును నయం చేయగలవని అంటున్నారు.
గుడ్లు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దగ్గును త్వరగా నయం చేస్తుంది. గుడ్లు అధిక ప్రోటీన్ కలిగి ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇది శరీరం దగ్గు లేదా జలుబుతో పోరాడేందుకు సహాయపడుతుంది. గుడ్లలో విటమిన్ డీ, బీ12 తోపాటు శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీర సహజ రక్షణను మెరుగుపరుస్తుంది. దగ్గు ఉన్నప్పుడు గుడ్లు తినడం సురక్షితమని చెబుతారు. నూనెలో వేయించిన గుడ్లను తినడం గొంతుకు భారంగా మారుతుంది.
గుడ్లు తినేటప్పుడు గొంతు తేమగా ఉండడానికి, దగ్గు వల్ల కలిగే అసౌకరాన్ని తగ్గించేందుకు తగినంత నీరు తాగాలి. దీంతోపాటు పసుపు, తేనె-నిమ్మరం లేదా తులసి, తేనె మిశ్రమంతో కలిపిన వెచ్చని పాలు తీసుకోవడం వల్ల దగ్గు నుంచి మరింత ఉపశమనం కలుగుతుంది. దగ్గు ఎక్కువగా ఉంటే జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గుడ్లలో విటమిన్లు ఎ, డి, ఇ పుష్కలంగా ఉంటాయి
గుడ్లు కంటిచూపు, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి చాలా అవసరం
గుడ్లలో ఉండే విటమిన్ బీ12, ఫోలేట్ లక్షణాలు ఎర్ర రక్త కణాలు, మెదడు ఏర్పడటానికి ప్రయోజనకరంగా ఉంటాయి
గుడ్లలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి.
గుడ్లలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి.
గుడ్లలోని కోలిన్ మెదడు అభివృద్ధికి, కాలేయ పనితీరుకు చాలా అవసరం
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పుష్టికి చాలా మంచిది.