
ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని మీకు తెలుసా..? ఇది ఇప్పుడు పెద్దలకే కాకుండా.. పిల్లలకు కూడా వస్తోంది అని డాక్టర్ కారుణ్య హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఈ సమస్య పెరగడానికి గల కారణాల గురించి డాక్టర్ కారుణ్య ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడూ స్క్రీన్లకే అతుక్కుపోవడం, కదలకుండా ఉండటం, అలాగే మార్కెట్లో దొరికే స్వీట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ స్నాక్స్ ఎక్కువగా తినడం వంటి అలవాట్లు లివర్ పై ఒత్తిడి పెడతాయని డాక్టర్ కారుణ్య చెబుతున్నారు. ఈ ఆహారంలో ఉండే అధిక ఫ్రక్టోజ్, హానికరమైన కొవ్వులు లివర్‌లో పేరుకుపోయి.. భవిష్యత్తులో ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని డాక్టర్ కారుణ్య విశ్లేషిస్తున్నారు.
అయితే మంచి విషయం ఏంటంటే.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని పూర్తిగా రివర్స్ చేయవచ్చని డాక్టర్ కారుణ్య అంటున్నారు. ఈ మార్పుల గురించి డాక్టర్ కారుణ్య కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ చిన్న మార్పులు వారి లివర్ ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. వారి భవిష్యత్తును కూడా సురక్షితంగా మారుస్తాయని డాక్టర్ కారుణ్య చెబుతున్నారు.