
కొందరు ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగుతుంటారు. అంతే కాకుండా కాఫీ తాగిన వెంటనే నీరు అలవాటు కొందరిలో ఉంటుంది. అయితే ఇలా కాఫీ తాగిన వెంటనే వాటర్ తాగకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

ఇలా కాఫీ తాగిన వెంటనే నీరు తాగడం వలన జీర్ణసంబంధ సమస్యలు వస్తాయంట. ముఖ్యంగా అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.

అంతే కాకుండా కాఫీ లేదా టీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగడం వలన పళ్లపై మరకలు ఏర్పడుతాయంట. దీని వలన దంతాల రంగు మారే అవకాశం ఉంటుందంట.

కాఫీ తాగిన వెంటనే నీరు తాగాలనిపించడానికి ముఖ్య కారణం టేస్ట్ బడ్స్ మారడం అంటున్నారు వైద్యులు. నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ మారడం వలన చాలా మందికి కాఫీ తాగిన వెంటనే నీరు తాగాలనిపిస్తుందంట.

ఇక కాఫీ తాగిన తర్వాత నీరు తాగడం వలన కొందరిలో తలనొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయంట. అందువలన వీలైనంత వరకు కాఫీ తాగడానికి ముందే మంచి నీరు తాగడం చాలా ఉత్తమం అంట.