Diabetes Tips: ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం.. నివారించడం ఎలా?

చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వేగంగా పెరుగుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. యువత కూడా బాధితులుగా మారుతున్నారు. ఈ వయస్సు వారు మధుమేహానికి దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక..

Diabetes Tips: ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం.. నివారించడం ఎలా?
Spinach for Diabetes

Updated on: Jun 18, 2024 | 12:58 PM

చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వేగంగా పెరుగుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. యువత కూడా బాధితులుగా మారుతున్నారు. ఈ వయస్సు వారు మధుమేహానికి దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధి మధుమేహం అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మారుతున్న జీవనశైలి వల్ల నేడు చాలా మంది మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. యువతలో కూడా ఈ వ్యాధి క్రమంగా పెరుగుతోంది.

డయాబెటిక్ అసోసియేషన్ ఆఫ్ బ్రిటన్ ప్రకారం, గత నాలుగు-ఐదు సంవత్సరాలలో, 40 ఏళ్లలోపు వారిలో మధుమేహం కేసులు 23 శాతం పెరిగాయి. ఈ పరిస్థితి బ్రిటన్ లోనే కాదు భారత్ లోనూ ఉంది. ఈ పరిస్థితి బ్రిటన్ లోనే కాదు భారత్ లోనూ ఉంది. ఇక్కడ కూడా 30-40 ఏళ్ల వయసు వారిలో మధుమేహం వేగంగా పెరుగుతోంది. ఏ వయసులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందో, దాని నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: Health Tips: మనిషి నీరు లేకుండా ఎంతకాలం జీవించవచ్చు.. నిపుణులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి

ఒక నివేదిక ప్రకారం.. టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 45 ఏళ్ల తర్వాత ఎక్కువగా పెరుగుతుంది. ఈ రకమైన మధుమేహం అమెరికాలో 14% మందిలో గుర్తించారు. వీరందరి వయసు 45 నుంచి 64 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ సంఖ్య 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు వారి కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. వయసు పెరిగే కొద్దీ మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది. అన్నింటిలో మొదటిది, మీ జీవనశైలిని మెరుగుపరచండి. తీపిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఇది కూడా చదవండి: Health Tips: చిన్న చిన్న విషయాలను మరచిపోతున్నారా? ఇలా చేయండి

అలాగే ఉప్పుకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఫాస్ట్‌ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండండి. పచ్చి కూరగాయలు తినండి. అలాగే జంక్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us