ఈ నీరు చాలా పవర్‌ఫుల్ గురూ..! డైలీ పరగడుపున ఇలా తీసుకుంటే షుగర్ లెవెల్ ఎప్పటికీ పెరగదంట..

|

Jun 11, 2024 | 8:00 PM

ప్రస్తుత కాలంలో మధుమేహం కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. డయాబెటిస్ కు ముఖ్య కారణం పేలవమైన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకునేందుకు నిత్యం చర్యలు అవసరం.. మధుమేహం ప్రధాన ఆరోగ్య సమస్య కావున.. ఆహారం, పానీయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

ఈ నీరు చాలా పవర్‌ఫుల్ గురూ..! డైలీ పరగడుపున ఇలా తీసుకుంటే షుగర్ లెవెల్ ఎప్పటికీ పెరగదంట..
Cloves Water
Follow us on

ప్రస్తుత కాలంలో మధుమేహం కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. డయాబెటిస్ కు ముఖ్య కారణం పేలవమైన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకునేందుకు నిత్యం చర్యలు అవసరం.. మధుమేహం ప్రధాన ఆరోగ్య సమస్య కావున.. ఆహారం, పానీయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మధ్యమధ్యలో ఏదైనా తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే లైఫ్ స్టైల్, డైట్ మెరుగవ్వాలి. అందుకోసం.. షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేసే హోం రెమెడీస్ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. అలాంటి వాటిలో లవంగం ఒకటి.. లవంగాలు షుగర్ ను కంట్రోల్ చేసేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

లవంగం నీరు ఆరోగ్య ప్రయోజనాలు..

చక్కెర స్థాయిలను నియంత్రించడంలో లవంగం నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం ఇందులోని గుణాల్లో ఒకటి.. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం

మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలను ఎలా ఉపయోగించాలి?

లవంగం డికాక్షన్: లవంగం డికాక్షన్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో 8-10 లవంగాలను వేసి మరిగించాలి. ఆ తర్వాత నీటిని ఫిల్టర్ చేసి కాస్త చల్లారిన తర్వాత తాగాలి.

తేనె – లవంగం నీరు: లవంగం నీటిలో తేనె కలుపుకుని తాగవచ్చు. దీని కోసం ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 4-5 లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. లేకపోతే కొంచెం వేడి చేసి దానిలో తేనె వేసుకోని తాగవచ్చు..అలాగే ఒక లవంగాన్ని ఎప్పుడో ఒకప్పుడు నోటిలో కొంతసేపు ఉంచుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవచ్చు..

అయితే రోజులో మీకు నచ్చిన విధంగా లవంగాలను తినవచ్చు.. దాని గుణాలు ఏమాత్రం తగ్గవు. ఆహారంలో మసాలాగా కూడా ఉపయోగించవచ్చు. ఇది శరీరంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.. ఇంకా చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.. అంతేకాకుండా, లవంగాలు అనేక ఇతర సమస్యల నుంచి బయటపడటంలో కూడా మేలు చేస్తాయి.

గమనిక..

అయితే.. లవంగాలు వేడి స్వభావంతో ఉంటాయి.. కావున మితంగా మాత్రమే లవంగాలను తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకోవద్దు.. ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..