Diabetes: మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి గుండె జబ్బుల ప్రమాదం.. షాకింగ్‌ నివేదిక

|

Oct 06, 2024 | 12:38 PM

ఈ రోజుల్లో మధుమేహం, గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. సరైన జీవనశైలి లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది మధుమేహం, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. నేటి వేగవంతమైన జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ద చూపడం లేదు. వృద్ధుల నుంచి యువకుల వరకు..

Diabetes: మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి గుండె జబ్బుల ప్రమాదం.. షాకింగ్‌ నివేదిక
Diabetes
Follow us on

ఈ రోజుల్లో మధుమేహం, గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. సరైన జీవనశైలి లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది మధుమేహం, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. నేటి వేగవంతమైన జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ద చూపడం లేదు. వృద్ధుల నుంచి యువకుల వరకు ఈ రోగాల బారిన పడుతున్నారు. నిపుణులు నిర్వహించిన పరిశోధన ప్రకారం.. మధుమేహం వ్యాధి ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది తీవ్రమైన పరిస్థితికి రావచ్చంటున్నారు. అలాంటప్పుడు ఏ మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.

మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది డయాబెటిస్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా హార్మోన్ సరిగ్గా పని చేయనప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది డయాబెటిస్‌కు కారణమవుతుంది. మధుమేహం రెండు రకాలు. మొదటిది టైప్ 1 డయాబెటిస్, ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. రెండవది టైప్ 2 మధుమేహం. ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి వల్ల ఈ సమస్య వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

కారణం ఏమిటి?

మధుమేహం వల్ల గుండె జబ్బులు రావడానికి చాలా కారణాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయి చాలా కాలం పాటు ఎక్కువగా ఉంటే, అది శరీరంలోని అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గుండె, దానికి సంబంధించిన నరాలను ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో గుండెపై చాలా ఒత్తిడి ఉంటుంది. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అదనంగా డయాబెటిక్ రోగులలో గుండె జబ్బుల ప్రమాదం తరచుగా చిన్న వయస్సులోనే పెరుగుతుంది. ఇతర కారణాలలో ధూమపానం, మద్యం, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, మూత్రపిండాల వ్యాధి, వ్యాయామం లేకపోవడం లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నాయి. దీన్ని నివారించే మార్గాలను తెలుసుకుందాం.

ఎలా రక్షించుకోవాలి?

  • మీ రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా తెలుసుకోండి. దానిని నియంత్రణలో ఉంచుకునేలా చేసుకోండి.
  • రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.
  • చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకుని, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలి.
  • మద్యం, ధూమపానం మానుకోండి.
  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలు తీసుకోండి.
  • రోజూ వ్యాయామం చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి