
దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూజ్ షిప్ (MV Hondius)ఎంవీ హోండియస్. ఆర్జెంటీనాలోని ఉషువాయా నుంచి అంటార్కిటికా వైపు బయలుదేరిన ఈ నౌకలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు, సిబ్బంది కలిసి సుమారు 150 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణం మొదట్లో అంతా సాధారణంగానే సాగింది. కానీ, ఏప్రిల్ మధ్యలో ఒక ప్రయాణికుడు తీవ్ర జ్వరం, శ్వాస సమస్యలతో అస్వస్థతకు గురయ్యాడు. కొద్ది రోజుల్లోనే మరికొందరికి కూడా అదే తరహా లక్షణాలు కనిపించాయి. మొదట ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకున్నారు. కానీ పరిస్థితి వేగంగా మారిపోయింది. ఒక్కొక్కరుగా ప్రయాణికులు కుప్పకూలడం ప్రారంభమైంది. మూడు మరణాలు నమోదయ్యాయి. కొంతమందిని అత్యవసరంగా దక్షిణాఫ్రికాకు తరలించారు. వైద్య పరీక్షల్లో చివరకు బయటపడింది ఒక అరుదైన వైరస్ పేరు Hantavirus Pulmonary Syndrome. అది కూడా సాధారణ హంటా వైరస్ కాదు. దక్షిణ అమెరికాలో కనిపించే ప్రమాదకరమైన ఆండీస్ స్ట్రెయిన్ (Andes virus). ఈ స్ట్రెయిన్ ప్రత్యేకత ఏమిటంటే, అరుదుగా మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపించే అవకాశం ఉండటం.
వైరస్ నిర్ధారణ కావడంతో నౌకను కేప్ వెర్డ్ సమీపంలో నిలిపివేశారు. ఎవరినీ బయటకు అనుమతించలేదు. నౌక మొత్తం తాత్కాలిక క్వారంటైన్ జోన్‌గా మారిపోయింది. సిబ్బంది PPE కిట్లు ధరించి పనిచేస్తున్నారు.
అనుమానితులను ప్రత్యేక గదుల్లో ఐసోలేట్ చేశారు. కానీ, ఇప్పటికే కొంతమంది ప్రయాణికులు మధ్యలోనే దిగిపోయి యూరప్, అమెరికా, ఇతర దేశాలకు విమానాల్లో వెళ్లిపోయారని తెలిసింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా అనేక దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వారిని గుర్తించి ట్రేస్ చేసే పనులు ప్రారంభమయ్యాయి.
అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో అనుమానిత కేసులు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హంటా వైరస్ సాధారణంగా ఎలుకల విసర్జన, మూత్రం, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. దుమ్ము రూపంలో శ్వాస ద్వారా శరీరంలోకి చేరుతుంది. మొదట జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయి. తర్వాత ఊపిరితిత్తులపై దాడి చేసి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనినే HPS (Hantavirus Pulmonary Syndrome) అంటారు. Hantavirus Pulmonary Syndrome ప్రస్తుతం దీనికి ప్రత్యేకమైన మందు లేదా వ్యాక్సిన్ లేదు. రోగి పరిస్థితిని బట్టి ఆక్సిజన్, ICU వంటి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే అందిస్తున్నారు. కొన్ని స్ట్రెయిన్లలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
So far, eight cases of #hantavirus have been reported, including three deaths.
While this is a serious incident, @WHO assesses the public health risk as low.
WHO will continue to work with all relevant governments and partners to provide care for those who are affected, protect… pic.twitter.com/NEBHXrqurT
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) May 7, 2026
ఇదే నౌకలో ప్రయాణించిన ఇద్దరు భారతీయుల గురించి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది స్పష్టంగా తెలియకపోవడంతో అధికారులు ట్రేసింగ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇది మరో COVID తరహా మహమ్మారి అవుతుందనే భయం అవసరం లేదు అని తెలిపింది. మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని, ప్రస్తుతం సాధారణ ప్రజలకు ప్రమాదం తక్కువగానే ఉందని WHO స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..