Telugu News Health Cough and Cold Problems For Kids in Winter, know ayurvedic tips for chest congestion problems
Cough And Cold Remedies: మీ పిల్లలను దగ్గు, రొంప వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో సమస్యలన్నీ పరార్
శీతాకాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఒకరి నుంచి ఒకరికీ వేగంగా జలుబు, రొంప విస్తరిస్తాయి. కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ప్రతి చిన్న సమస్యకు డాక్టర్లపై ఆధారపడకుండా కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. ముఖ్యంగా రొంప, జలుబు సమస్యలకు మొదటిగా ఇంటి చిట్కాలను ప్రయత్నించి, అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.
చలికాలంలో అందరినీ వేధించే సమస్య జలుబు, రొంప. ఇవి ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా వస్తాయి. శీతాకాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఒకరి నుంచి ఒకరికీ వేగంగా జలుబు, రొంప విస్తరిస్తాయి. కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ప్రతి చిన్న సమస్యకు డాక్టర్లపై ఆధారపడకుండా కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. ముఖ్యంగా రొంప, జలుబు సమస్యలకు మొదటిగా ఇంటి చిట్కాలను ప్రయత్నించి, అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా దగ్గు, గొంతునొప్పి, ముక్కు పట్టేయడం వంటి సమస్యలకు పెద్దలు చెప్పిన కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. ఒకవేళ తీవ్రత మరీ ఎక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలి. అందరూ పాటించే వంటింటి చిట్కాలను ఓ సారి తెలుసుకుందాం.
గొంతు నొప్పి లేదా గొంతు బొంగురుపోయినప్పుడు ఉప్పు, పసుపు లేదా త్రిఫల చూర్ణం కలిపిన వేడి నీటిని పదే పదే పుక్కిలిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆరు నెలల కంటే తక్కువ ఉన్న పిల్లలకు దగ్గు, జలుబు వంటి సమస్యలకు మందులు ప్రభావవంతంగా పని చేయవు. ఈ వయస్సున్న పిల్లలకు ముఖ్యంగా తల్లి నుంచే ఇవి సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి వీరి విషయంలో తల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
శిశువుల్లో జీర్ణ శక్తి, తెలివితేటలు, రోగనిరోధక శక్తిని పెంచడానికి మన పెద్దలు వసను పడుతుంటారు. ఈ వసను ఇలాంటి సమయంలో ఇస్తే మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది.
జలుబు, ముక్కు సమస్యలకు అల్లం చాలా బాగా పని చేస్తుంది. దీన్ని పాలల్లో మరిగించి పిల్లలకు ఇవ్వొచ్చు. అలాగే వేడి నీటిలో మరిగించి ఆ నీటిని తాగవచ్చు.
పిల్లలు లేదా పెద్దలకు జలుబు చేసినప్పుడు పుదీనా చాలా మంచిగా ప్రభావం చూపుతుంది. పుదీనా ఆకును మెత్తగా పేస్ట్ లా చేసి దాన్ని తేనెతో కలిపి తింటే సమస్య నుంచి ఇట్టే బయటపడవచ్చు.
జలుబు, దగ్గు సమస్యలకు తులసి కూడా మంచి పరిష్కారంగా కనిపిస్తుంది. తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని తాగితే సమస్యల దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తినగలిగితే తులసి ఆకు శుభ్రం చేసి డైరెక్ట్ గా కూడా తినవచ్చు.
త్రికటు అనే ఆయుర్వేద పొడితో చేసిన కషాయం కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. త్రికటు కషాయాన్ని ఎండు అల్లం, మిరియాలు, పొడవైన మిరియాల మిశ్రమంతో చేస్తారు.
శీతాకాలంలో ముఖ్యంగా పిల్లలను వేధించే సమస్య ముక్కు దిబ్బడ. అందరి పిల్లలూ ఈ కాలంలో ముక్కు పట్టేస్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆవిరి పట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.
శ్వాసకోశ సమస్యలకు నివారణకు చికిత్సలు
శీతాకాలంలో ఎల్లప్పుడు వంటి కప్పుతూ ఉంటూ శరీరమంతా వేడిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి
ముఖ్యంగా ప్రయాణ సమయంలో, రాత్రి సమయంలో చెవులను కూడా కప్పుకుని జాగ్రత్తగా ఉండాలి.
చల్లటి నీరు తాగకూడదు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన వాటిని తినవద్దు.
అధిక కాలుష్యం, పొగమంచు ఉన్న ప్రదేశాల్లో రక్షణ కోసం మాస్క్ ధరించడం తప్పనిసరి.
చల్లటి నీటిలో తలస్నానం చేయకూడదు. అలాగే తడి జుట్టుతో నిద్రించకూడదు.
పాఠశాలలో అనారోగ్యంతో ఉన్న పిల్లలకు దూరంగా ఉండాలి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పిల్లలకు నేర్పించాలి.