Coronavirus Incubation Period:కరోనా కొన్ని నెలలుగా ప్రపంచ గతినే మార్చేసిన పేరు. ప్రజలు కనీ, వినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కునేలా చేసిన మహమ్మారి కరోనా. దీని దెబ్బకి ఆర్ధిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయిపోయాయి. మొదటిసారి వచ్చినపుడు దీని గురించి ఎవరికీ ఏమీ తెలీదు. వచ్చింది.. ప్రపంచాన్ని స్తంభించిపోయెలా చేసింది. తగ్గుతున్నట్టు కనిపించింది. ప్రపంచం మళ్ళీ మెల్లగా ఒక దారిలోకి రావడం మొదలైంది. ఇంతలోనే రెండో వేవ్ అంటూ విరుచుకుపడుతోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చింది. అయినా, దాని ఫలితాలు అందే లోపే మళ్ళీ రెచ్చిపోతోంది కరోనా. దేశవ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాదు..మొదటి సారికన్నా ఈసారి మరణాల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. అసలు కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? దీని ఇంక్యుబేషన్ పిరియడ్ ఎంత? ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడానికి ఎంత కాలం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటికీ కచ్చితమైన సమాధానాలు ఎవరిదగ్గరా లేవు. ఎందుకంటే.. కరోనా జిత్తులమారి తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తోంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కరోనా ఏరకంగా వ్యాపిస్తుంది? దీని ఇంక్యుబేషన్ కాలం ఎంత అనే వివరాలు పరిశీలిద్దాం.
ఇంక్యుబేషన్ అంటే..
వైరస్ ఒక వ్యక్తికీ సోకిన తరువాత లక్షణాలను చూపించడానికి పట్టే సమయాన్ని ఇంక్యుబేషన్ గా చెబుతారు. ఈ ఇంక్యుబేషన్ సమయంలో రోగికి అంటే వైరస్ సోకిన వారికీ దాని లక్షణాల్లో ఏదైనా ఒకటి లేదా రెండు లక్షణాల్ని వృద్ధి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ గాలిలో శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. అందువల్ల లక్షణాలు పూర్తిగా కనిపించడానికి 3-14 రోజుల వరకూ పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా లక్షణాలు ప్రారంభం అవ్వచ్చు. సాధారణంగా ఐదో రోజు నుంచి లక్షణాల కనబడటం ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే ఇతమిత్థంగా కరోనా ఇంక్యుబేషన్ కాలం ఇంత అనేది చెప్పలేకపోతున్నారు. అయితే, చైనాలో ఊహాన్ లో వైరస్ వ్యాప్తి సమయంలో చేసిన అధ్యయనాల ఆధారంగా ఇంక్యుబేషన్ పిరియడ్ సుమారుగా 5 రోజులుగా పేర్కొంటూ వస్తున్నారు నిపుణులు.
ఇంక్యుబేషన్ వ్యవధి రోగికి వైరస్ను పట్టుకోవటానికి మరియు లక్షణాలను చూపించడానికి ప్రారంభమయ్యే సమయాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో, అనుమానిత COVID-19 రోగులు వైరల్ వ్యాధికి సంబంధించిన ఏదైనా లేదా ఒక లక్షణాన్ని అభివృద్ధి చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇన్ఫెక్షన్ గాలిలో శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి, లక్షణాలు పూర్తిగా సోకడానికి 3-14 రోజుల మధ్య ఎక్కడైనా పట్టవచ్చు, మరింత ప్రముఖ లక్షణాలు అనువర్తనానికి ప్రారంభమవుతాయి 5 వ రోజు చుట్టూ కనిపించడం ప్రారంభమైంది. ఈ అంచనాలు చైనాలోని వుహాన్‌లో వైరస్ వ్యాప్తి సమయంలో చేసిన అధ్యయనాల ఆధారంగా వ్యాధి యొక్క కేంద్రంగా పరిగణించబడుతున్నాయి. ఇది కొత్త జాతి కనుక, కరోనా వైరస్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు ఎలా సోకుతుందో అలాగే, రోగనిరోధక శక్తిని ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకోవడానికి పరిశోధకులు ఇంకా ప్రయత్నిస్తునే ఉన్నారు.
జామాలో ప్రచురణలోకి వచ్చిన మరో అధ్యయనం ప్రకారం, వైరస్ తెలివిగా మారడంతో, 24 రోజుల వరకూ కూడా ఒక్కోసారి ఏదైనా లక్షణాలను గుర్తించడం కష్టమవుతుంది. చాలామందిలో కరోనావైరస్ లక్షణరహిత పరిస్థితులతో కూడా ప్రారంభమవుతుంది, అంటే, వీరిద్వారా.. వీరికి తెలియకుండానే వైరస్ ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాపిస్తుంది. సాధారణంగా 12 వ రోజు నాటికి లక్షణం లేని ఎవరైనా లక్షణాలు వచ్చే అవకాశం లేదు, కానీ ఆ వైరస్ ఇతరులకు చేరే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంది అంటున్నారు నిపుణులు. 12 వ రోజు నాటికి కరోనా సోకినా.. లక్షణాలను అభివృద్ధి చేయకపోయినా కూడా, వారు వ్యాధిని వ్యాప్తి చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు. అందుకే, ఎక్కడన్నా అనుమానం ఉన్నవారిని 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండమని సూచిస్తూ వచ్చారు. వ్యాధి లక్షణాలు లేకపోయినా, వైరస్ జాడలు ఉండే అవకాశాన్ని కొట్టిపారేసే పరిస్థితి ప్రస్తుతం అసలు లేదని చెబుతున్నారు.
చూడవలసిన లక్షణాలు ఏమిటి?
సాధారణంగా జలుబు, దగ్గు దీనికి ప్రాథమిక లక్షణాలుగా చెప్పొచ్చు. అయితే, అన్ని జలుబు, దగ్గు లక్షణాలు కరోనా అయ్యే అవకాశాలు లేవు. ఈ రెండు లక్షణాల్లో ఏదైనా కనిపించి వైద్యుని వద్దకు వెళ్లేముందు కొన్నిరోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే, దీనివలన కరోనా కాకపోయినా ఆసుపత్రికి వెళ్ళాకా అక్కడి పరిస్థితుల్లో ఏదైనా వైరస్ సోకే అవకాశాన్ని నివారించవచ్చు. అదేవిధంగా ఐదు రోజుల తరువాతే దీని లక్షణాలు బయటపడే అవకాశాలు ఎక్కువ కాబట్టి.. ఆ టైం వరకూ చిన్న లక్షణమే అని బయట తిరిగితే.. వైరస్ సంక్రమణ జరిగే అవకాశం ఉంటుంది. కరోనా శ్వసకోశానికి, దాని లైనింగ్ కి మొదట సోకుతుంది. ఇది అక్కడ మంట అనిపిస్తుంది. ఇక జలుబుగా ప్రారంభమయ్యే లక్షణాలకు దారి చూపిస్తుంది. ఇక కరోనా అని అనుమాన పడటానికి ముఖ్యంగా ఈ కింది లక్షణాలను పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి లేదా రెండు లక్షణాలు కనబడినా మొదట సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లి.. తరువాత వెంటనే టెస్ట్ లు చేయించుకోవడం ద్వారా కరోనాను గుర్తించవచ్చు.
Also Read: Chandrababu on Corona : ఏపీలో కరోనా విలయతాండవానికి ముఖ్యమంత్రి జగన్ వైఫల్యమే కారణం : చంద్రబాబు
Sameera Reddy: నాతో పాటు నా పిల్లలకు కూడా కరోనా బారిన పడ్డారు.. జాగ్రత్తగా ఉండమంటూ ఎమోషనల్ పోస్ట్