కాఫీ తాగడం వల్ల తాజాదనం లభిస్తుంది.. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. చురకుదనం, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫిన్. సాధారణంగా కాఫీని ఎనర్జీ డ్రింక్ గా కూడా పేర్కొంటారు. ఇది కాకుండా, కాఫీని అధికంగా తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఇది కూడా నూటికి నూరు శాతం నిజం.. ఎందుకంటే ఎక్కువ తాగితే శరీరానికి మంచికి బదులు చెడు జరుగుతుంది. ఒక అంచనా ప్రకారం.. ప్రపంచంలో ప్రతిరోజూ దాదాపు 40 వేల కోట్ల కప్పుల కాఫీ తాగుతున్నారు. అయితే, ప్రతి ఒక్కరూ కాఫీని వేర్వేరుగా తీసుకుంటారు. కొందరు వేడి కాఫీని ఇష్టపడతారు. కొంతమంది కోల్డ్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఇంకొంతమంది బ్లాక్ కాఫీని తాగుతారు.
ఆరోగ్యానికి సంబంధించి.. కాఫీ నాణ్యత, ఎంతసేపు వేడి చేశారు.. ఏ ఉష్ణోగ్రత వద్ద తాగారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అరబికా కాఫీ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ. దీనిని ఆరోగ్యకరమైన కాఫీగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ రకమని పరిశోధకులు పేర్కొంటున్నారు.