Acidity Prevention Tips: చాలా మందికి ఎసిడిటీ సమస్య ఉంటుంది. తినే ఆహార అలవాట్లు, రకరకాల ఆహార పదార్థాలు తినడం, సమయానికి భోజనం చేయకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, ఆవలింతలు వంటివి వస్తుంటాయి. ఎక్కువగా తినడం, సమయం కాని సమయంలో తినడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ పాటించడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, హానికరమైన ఆహారం వంటి అనేక అంశాలు ఎసిడిటీకి దారితీస్తాయి. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు. ఎసిడిటీ నివారణకు అనేక చిట్కాలను సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.
► ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి.
► ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తింటే కూడా ప్రమాదమే.
► పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది.
► సమయానికి భోజనం చేయకుండా ఉండకపోవడం మంచిది.
► ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్ వంటి తరచూ తీసుకోవడం మానుకోండి.
► రాత్రి పడుకునే సమయంలో తినకండి. పడుకోవడానికి కనీసం గంట ముందు డిన్నర్ చేయండి.
► మాంసాహారం ఎక్కువగా తినకపోవడమే మంచిది.
► మీ కూరల్లో అధిక మొత్తంలో వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు లేకుండా చూసుకోండి.
► బిజీ పనుల వల్ల భోజనాన్ని ఆలస్యం చేయకండి.
► రోజూ క్రమ పద్ధతిలో సమయం ప్రకారం తినడం అలవాటు చేసుకోండి.
► భోజనం చేసిన వెంటనే, పడుకోవడం మానుకోండి. ఇది మీ పొట్ట భాగంలో ఆహారం మిగిలిపోయేలా చేస్తుంది. ఇది వల్ల ఎసిడిటి ఎదురవుతుంది.
ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతున్న వారు కొన్ని సులభమైన ఇంటి నివారణ చిట్కాలను పాటించినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది.
► ప్రతి రోజూ కొన్ని కొత్తిమీర వాటర్ తాగండి.
► ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తినండి.
► భోజనం తర్వాత అర టీస్పూన్ సోంపు గింజలను నమలండి.
► మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు లేదా షర్బత్ రసం తాగండి.
► తగినంత విశ్రాంతి తీసుకోండి, తగినంత నీరు తాగండి. మంచి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
► నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇది మీ నిద్రలేమి, మలబద్ధకానికి చెక్ పెడుతుంది.
► రోజ్ వాటర్, పుదీనా నీరు తాగండి, ఇది మీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.