Aloe Vera Benefits: మీ చర్మం మిలమిల మెరిసిపోవాలా.. అయితే కలబందతో ఇలా చేయండి..

కలబంద ఔషధ గుణాలకు ప్రసిద్ధి. అలోవెరాలో ఉండే శీతలీకరణ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, కీళ్ల నొప్పులు..

Aloe Vera Benefits: మీ చర్మం మిలమిల మెరిసిపోవాలా.. అయితే కలబందతో ఇలా చేయండి..
Aloe Vera

Updated on: Mar 01, 2022 | 4:52 PM

కలబంద ఔషధ గుణాలకు ప్రసిద్ధి. అలోవెరాలో ఉండే శీతలీకరణ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, కీళ్ల నొప్పులు వంటి కొన్ని సాధారణ సమస్యల నుంచి దూరం చేస్తాయి. కలబంద మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అందుకే కలబందను తీసుకోవాలి. అది జ్యూస్‌ రూపంలో అయితే బాగుటుంది. మీరు కలబంద రసాన్ని రోజూ తీసుకోవచ్చు. అలోవెరా జ్యూస్ ప్రస్తుతం మార్కెట్‌లో సులువుగా లభిస్తున్నప్పటికీ, మీరు దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం..

అలోవెరా జ్యూస్ చేయడానికి కలబంద ఆకు, నీరు, తేనె , నిమ్మరసం అవసరం. కత్తితో కలబంద తొక్కను తీసివేయాలి. ఒక చెంచా తీసుకుని తాజా అలోవెరా జెల్‌ని బయటకు తీయాలి. అలోవెరా జెల్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకసారి నీటితో శుభ్రం చేసుకోవాలి. గ్రైండర్‌లో అలోవెరా జెల్ , కొంత నీరు పోసి. మిక్సీ పట్టాలి. ద్రవాన్ని ఒక గ్లాసులో తీసుకుని రుచికి అనుగుణంగా తేనె కలుపుకోవాలి. నిమ్మరసంలో పిండడం వల్ల కలబంద రసం రుచి పెరుగుతుంది.

ప్రయోజనాలు

కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి చాలా మేలు చేస్తాయి. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అలోవెరా జ్యూస్ వ్యాధితో పోరాడే శరీర శక్తిని పెంచి అలర్జీలను దూరం చేస్తుంది. కలబంద రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కలబంద పూర్తిగా సహజమైనది. మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. కలబంద రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి మన శరీరానికి చాలా అవసరం. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.

Read Also… Calcium: మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి..