
కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే తాజా పండ్లు తినాలి. ఆపిల్, బెర్రీలు లేదా బొప్పాయి వంటి పండ్లను మీ ఆహారంలో చేర్చండి. ఈ పండ్లు మీ కిడ్నీకి మేలు చేస్తాయి.

ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిని తాగడం ప్రారంభించండి. రాత్రంతా నీరు త్రాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా పని చేయాలంటే తగినన్ని నీటిని తాగడం చాలా అవసరం.

రక్త ప్రసరణను మెరుగుపరచడం, కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామంతో మీ రోజును ప్రారంభించండి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ లేదా తులసి టీ తాగండి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో, కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బెర్రీలు, ఆకుకూర కూరగాయలు, ఆలివ్ నూనె వంటి పదార్థాలను మీ ఆహారంలో చేర్చండి. ఫైబర్, ప్రోటీన్ సమతుల్యంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడానికి యోగాను అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే భుజంగాసనం వంటి యోగా ఆసనాలు లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉదయాన్నే ప్రాసెస్డ్ స్నాక్స్ లేదా చక్కెర పదార్థాలను తీసుకోవడం మానేయండి.

డాక్టర్ సిఫారసు చేసినప్పుడు మాత్రమే నొప్పి నివారణ మందులు తీసుకోవాలి. తరచుగా వీటిని వాడటం కిడ్నీపై చెడు ప్రభావం చూపుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకండి. అధిక కాఫీ తీసుకోవడం కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఉదయాన్నే తిన్న ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించండి. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ఆసిడిటీ సమస్యలు ఏర్పడతాయి. ఇది కిడ్నీ ఆరోగ్యానికి మంచిది కాదు.