
క్యాన్సర్ అన్న పదం వింటే చాలు మనసులో ఒకింత అలజడి చెలరేగుతుంది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగడం ఒక శుభ పరిణామం. అయితే క్యాన్సర్‌కు ముందుగానే గుర్తిస్తే.. దాన్ని జయించడం ఈజీ అవుతుంది. వ్యాధి ప్రారంభ దశలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అలక్ష్యం చేయవద్దు. ఆ సింటమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
శరీరంలో మార్పులు: హైపర్‌పిగ్మెంటేషన్, జాండిష్, చర్మంపై దురద, స్కిన్ రంగు మారడం వంటి లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు. చర్మ క్యాన్సర్లతో పాటు, కొన్ని ఇతర క్యాన్సర్లు సమయంలో శరీరంలో ఈ మార్పులు వస్తాయి.
గాయాలు మానకపోవడం: చర్మంపై పుట్టుమచ్చలు, పులిపిర్లు అకస్మాత్తుగా ఏర్పడటం. అవి పెరుగుతూ ఉండటం.. వాటి నుంచి రక్తం కారణం వంటి లక్షణాలను అశ్రద్ద చేయవద్దు. అలానే గాయాలు మానకపోవడాన్ని కూడా క్యాన్సర్ లక్షణంగా భావించాలి.
డయేరియా, మలబద్ధకం, మలంలో మార్పులు, మూత్రంలో రక్తం పడటం, పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించడం, యూరిన్ పోసేటప్పుడు నొప్పి బ్లాడర్ లేదా ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంకేతాలు. వృషణాలు, గ్రంథులు, కణజాలం, రొమ్ముల్లో మార్పులను అలక్ష్యం చేయవద్దు. నీటిని తాగడం, ఆహారాన్ని మింగడంలో ఇబ్బందులు, విపరీతంగా దగ్గు, గొంతు బొంగురుపోవడం, విరేచనాలు తగ్గకపోవడం కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు సంకేతాలు.
(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఎలాంటి సంకేతాలు, సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..