క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఆస్ట్రేలియా

లాక్‌డౌన్ మంత్రంతో ప్రపంచ దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేస్తున్నాయి. కొవిడ్-19ను జయించటంలో ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉంది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరు నెలల పాటు లాక్ డౌన్ విధించడమే కాదు, కఠినమైన ఆంక్షలు అమలు చేసి ఎక్కువ నష్టం జరగకుండా చూసుకుంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7,209 మందికి కరోనా నిర్ధారణ కాగా, ప్రస్తుతానికి 405 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు మారుతుండటంతో కరోనా ఆంక్షలను క్రమంగా సడలించాలని ప్రధాని స్కాట్ మోరిసన్ భావిస్తున్నారు. ముఖ్యంగా, […]

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఆస్ట్రేలియా
Follow us

|

Updated on: Jun 12, 2020 | 10:28 PM

లాక్‌డౌన్ మంత్రంతో ప్రపంచ దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేస్తున్నాయి. కొవిడ్-19ను జయించటంలో ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉంది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరు నెలల పాటు లాక్ డౌన్ విధించడమే కాదు, కఠినమైన ఆంక్షలు అమలు చేసి ఎక్కువ నష్టం జరగకుండా చూసుకుంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7,209 మందికి కరోనా నిర్ధారణ కాగా, ప్రస్తుతానికి 405 మంది చికిత్స పొందుతున్నారు.

ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు మారుతుండటంతో కరోనా ఆంక్షలను క్రమంగా సడలించాలని ప్రధాని స్కాట్ మోరిసన్ భావిస్తున్నారు. ముఖ్యంగా, క్రీడారంగంపై కఠిన నిబంధనలు తొలగించాలనే యోచిస్తున్నారు. ఇకపై స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వలోనే వివిధ క్రీడా పోటీల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందిస్తామని ప్రధాని వెల్లడించారు.